తెలంగాణ

telangana

టికెట్ల తొక్కిసలాటలో మహిళ మృతి...! క్లారిటీ ఇచ్చిన పోలీసులు

By

Published : Sep 22, 2022, 4:03 PM IST

Updated : Sep 22, 2022, 4:17 PM IST

TS police clarified that the woman did not die in the stampede at the gymkhana ground

జింఖానా మైదానంలో జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళ మృతి చెందినట్లు వార్తలు వచ్చాయి. దీనిపై పోలీసులు స్పందించారు. తొక్కిసలాటలో ఎవరూ చనిపోలేదని పోలీసులు స్పష్టంచేశారు.

భారత్-ఆస్ట్రేలియా మధ్య ఉప్పల్​ వేదికగా.. ఈ నెల 25న జరగనున్న టీ-ట్వంటీ మ్యాచ్​ టికెట్ల కోసం క్రికెట్ అభిమానులు భారీగా తరలిరావడంతో.. సికింద్రాబాద్​ జింఖానా మైదానం వద్ద తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. టిక్కెట్ల కోసం నాలుగైదు రోజుల నుంచే.. భారీగా అభిమానులు తరలివస్తున్నారు. హెచ్​సీఏ టిక్కెట్లను బ్లాక్​లో అమ్ముతోందంటూ ఆందోళనలు చేపట్టారు. ఓ న్యాయవాది ఏకంగా హెచ్​ఆర్సీలో పిటిషన్​ వేశాడు. ఈ నేపథ్యంలో ఇవాళ్టి నుంచి ఆఫ్​లైన్​లో టికెట్లు ఇస్తామని హెచ్​సీఏ ప్రకటించడంతో.. క్రికెట్ అభిమానులు భారీగా తరలివచ్చారు.

చాలా మంది తరలివస్తారనే అంచనాలు ఉన్నప్పటికీ.. సరైన ఏర్పాట్లు చేయలేదు. మెయిన్​ గేట్​ ద్వారా ఒక్కసారిగా అభిమానులు తోసుకొచ్చారు. పరిస్థితి అదుపు తప్పడంతో పోలీసులు లాఠీఛార్జ్​ చేశారు. తోపులాటలో కొందరు స్పృహ తప్పి పడిపోయారు. మరికొంత మందికి గాయాలయ్యాయి. గాయపడిన వారిని చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. అయితే ఇందులో ఓ మహిళ చనిపోయినట్లు వదంతులు వచ్చాయి. దీనిపై పోలీసులు క్లారిటీ ఇచ్చారు.

జింఖానా మైదానంలో జరిగిన తొక్కిసలాటలో ఎవరూ చనిపోలేదని పోలీసులు స్పష్టంచేశారు. స్పృహతప్పి పడిపోయినవారు, గాయపడినవారి పరిస్థితి నిలకడగా ఉందని తెలిపారు. దయచేసి దుష్ప్రచారం చేయొద్దని పోలీసులు విజ్ఞప్తి చేశారు. టిక్కెట్ల విక్రయంలో హెచ్‌సీఏ పూర్తి వైఫల్యం చెందిందని... ఉన్నతాధికారులతో చర్చించి కఠిన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.

ఇక ఉప్పల్ మ్యాచ్‌పై మంత్రి శ్రీనివాస్‌ గౌడ్ సమీక్ష నిర్వహిస్తున్నారు. ఈ సమీక్షలో అజారుద్దీన్, సీపీ మహేష్ భగవత్, క్రీడాశాఖ కార్యదర్శి, అధికారులు పాల్గొన్నారు.

ఇవీ చదవండి:

Last Updated :Sep 22, 2022, 4:17 PM IST

ABOUT THE AUTHOR

...view details