తెలంగాణ

telangana

నీతిఆయోగ్‌ సమావేశానికి కేసీఆర్ వెళ్లకపోతే.. మోదీకి లొంగినట్లే: రేవంత్‌రెడ్డి

By

Published : Aug 6, 2022, 8:09 PM IST

REVANTH REDDY

revanth reddy fires on cm kcr: ముఖ్యమంత్రి కేసీఆర్ నీతి ఆయోగ్ సమావేశాలకు హాజరు అవ్వడం లేదని ప్రకటించడంపై పీసీసీ రేవంత్‌ మండిపడ్డారు. నీతి ఆయోగ్‌ సమావేశానికి హాజరై మోదీని కేసీఆర్‌ నిలదీయాలని సూచించారు. రాష్ట్రానికి రావాల్సిన ప్రాజెక్టులపై ప్రశ్నించాలని కోరారు.

revanth reddy fires on cm kcr: ప్రభుత్వ వ్యవస్థలను తెరాస, భాజపా దుర్వినియోగం చేస్తున్నాయని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి మండిపడ్డారు. విపక్షాలపై నిఘా పెట్టేందుకు ఐబీ వ్యవస్థలను వాడుకుంటున్నారని ఆరోపించారు. కాంగ్రెస్‌ను దెబ్బతీసేందుకు మోదీ ఈడీ, సీబీఐని వాడుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించేందుకు కేసీఆర్‌ పోలీసు వ్యవస్థను వాడుకుంటున్నారని పేర్కొన్నారు. కేసీఆర్‌, మోదీని ప్రజలు ఎవరూ నమ్మరని అభిప్రాయపడ్డారు.

Revanth reddy on kcr and modi:ప్రధాని మోదీ, ముఖ్యమంత్రి కేసీఆర్‌... ఒకే నాణెనికి బొమ్మబొరుసు వంటి వారని ఆరోపించారు. దర్యాప్తు సంస్థలను ఉపయోగించుకుని రాజకీయాలకు పాల్పడుతున్నారని విమర్శించారు. మోదీపై విమర్శలు చేసినంత మాత్రన కేసీఆర్‌ను నమ్మే పరిస్థితి లేదన్నారు. నీతిఆయోగ్‌ సమావేశానికి హాజరై.... రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై ప్రధానిని నిలదీయాలని రేవంత్‌రెడ్డి డిమాండ్‌ చేశారు.

రేవంత్‌రెడ్డి ప్రసంగం

రాష్ట్రంలో కేసీఆర్‌ ప్రతిపక్ష నేతల సూచనలను వింటున్నారా? నీతిఆయోగ్‌ సమావేశంలో మోదీని కేసీఆర్ నిలదీయాలి. రాష్ట్రానికి రావాల్సిన ప్రాజెక్టుల గురించి నీతిఆయోగ్‌లో నిలదీయాలి. నీతిఆయోగ్‌ సమావేశానికి వెళ్లకపోతే చక్కని అవకాశం దుర్వినియోగం అవుతుంది. సమావేశానికి వెళ్లకపోతే మోదీకి కేసీఆర్‌ లొంగిపోయి ఉన్నట్లు భావించాల్సి ఉంటుంది. మోదీని ప్రశ్నించే అవకాశాన్ని కోల్పోవద్దు. నీతిఆయోగ్‌ సమావేశానికి వెళ్లకపోతే రాష్ట్రానికి నష్టం. - రేవంత్‌రెడ్డి, ముఖ్యమంత్రి

ఇవీ చూడండి:

ABOUT THE AUTHOR

...view details