తెలంగాణ

telangana

Private Debt Scheam: రుణవిముక్తికి నోచుకునేవారేరి.. నిరాదారణకు గురైన పథకం

By

Published : May 9, 2022, 5:34 AM IST

Debt

Private Debt Scheam: ప్రైవేటు అప్పులు తీసుకుని ఇబ్బందులు పడుతున్న రైతులను ఆదుకునేందుకు ఓ పథకం ఉంది. కానీ, అది నత్తనడకన అమలవుతోంది. నిర్దేశించిన లక్ష్యంలో కనీసం 10 శాతం అంచనాలను అందుకోలేకపోతోంది. అసలు ఇలాంటి ఓ పథకం ఉందనే విషయం అన్నదాతలకు తెలియకపోవటం కారణమని అధికారులు చెబుతున్నారు.

Private Debt Scheam: ప్రైవేటు వ్యాపారుల వద్ద అధిక వడ్డీకి తీసుకున్న రుణాల నుంచి రైతులకు విముక్తి కల్పించే పథకం రాష్ట్రంలో పది శాతం కూడా ఆచరణకు నోచుకోవట్లేదు. ప్రైవేటు అప్పులు తీర్చడానికి వీలుగా ఎలాంటి పూచీకత్తు లేకుండా అన్నదాతలకు డెబిట్‌ స్వాపింగ్‌ లోన్‌ ఇవ్వాలన్న రిజర్వ్‌ బ్యాంకు ఆదేశాలు నిరాదరణకు గురయ్యాయి. నిబంధనల ప్రకారం గత ఆర్థిక సంవత్సరంలో పంట రుణాల్లో 3 శాతం రూ. 17 వందల 70 కోట్ల రూపాయలు అప్పు మార్పిడి రుణం ఇవ్వాలని రాష్ట్రస్థాయి బ్యాంకర్ల సమితి నిర్ణయించింది. అన్ని బ్యాంకులకు రుణ లక్ష్యాలను నిర్దేశించింది. ఐతే ఆర్థిక సంవత్సరం పూర్తయినా ఈ మొత్తంలో 10 శాతం కూడా ఇవ్వలేదని అధికార వర్గాలు అంచనాకు వచ్చాయి.

డీఎస్​ఎల్​లో కోటా కింద రుణాల పంపిణీ పెద్దగా జరగలేదని రాష్ట్రస్థాయి బ్యాంకర్ల సమితి తెలిపింది. ఈ విధంగా అప్పులు ఇస్తారనే విషయంపై రైతులు, బ్యాంకుల సిబ్బందికి పెద్దగా అవగాహన లేకపోవడంతోనే పంపిణీ చాలా తక్కువగా ఉన్నట్లు వెల్లడించింది. రైతుకు బ్యాంకులో పంట రుణానికి సంబంధించి పాత బాకీ ఉన్నా సరే ప్రైవేటు అప్పులు తీర్చడానికి అదనంగా రుణాలివ్వాలని ఆర్బీఐ ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. డీఎస్​ఎల్​ కింద రుణం ఇవ్వడానికి తిరస్కరిస్తే స్థానిక లోక్‌అదాలత్‌లో ఫిర్యాదు చేయాలని హైకోర్టు సైతం తీర్పు ఇచ్చింది. అయితే ఎక్కువ మంది రైతులకు ఈ విషయం తెలియక బ్యాంకులపై ఫిర్యాదులేమీ చేయడం లేదు.

పంట రుణాల్లోనూ బ్యాంకులు నిబంధనలు పాటించడం లేదు. రైతుకు ఉన్న పొలాన్ని బట్టి ఎలాంటి పూచీ లేకుండా రూ. లక్షా 60 వేలు, పూచీకత్తుతో రూ. 3 లక్షల వరకూ పంటరుణం ఇవ్వాలని ఆర్బీఐ ఆదేశాలున్నాయి. ఈ ఆర్థిక సంవత్సరంలో వరిసాగు కోసం ఎకరాకు రూ. 40 వేలు ఇవ్వాలని బ్యాంకర్ల సమితి నిర్ణయించింది. అయినా పట్టాదారు పాసుపుస్తకాలను పూచీకత్తుగా పెట్టుకునే రుణాలిస్తున్నారని... గరిష్ఠంగా లక్షకు మించి ఇవ్వడం లేదని రైతులు వాపోతున్నారు. గతేడాది రూ. 59 వేల కోట్ల పంట రుణాలివ్వాల్సి ఉండగా.. డిసెంబరు 31 నాటికి 53 శాతమే పంపిణీ చేశారు.

ఇదీ చదవండి :రాజకీయ పర్యాటకులు వస్తుంటారు.. పోతుంటారు: కేటీఆర్​

రూ.180 చెప్పులు ఎత్తుకెళ్లారని ఫిర్యాదు.. నవ్వుకున్న పోలీసులే చివరకు...

ABOUT THE AUTHOR

...view details