తెలంగాణ

telangana

అటు ఐటీ.. ఇటు మల్లారెడ్డి.. మధ్యలో ల్యాప్​టాప్

By

Published : Nov 25, 2022, 4:45 PM IST

Laptop Issue Between IT officials And Mallareddy

Laptop Issue Between IT officials And Mallareddy: రాష్ట్రంలో మంత్రి మల్లారెడ్డి ఇంటిపై ఐటీ అధికారులు సోదాలు చేపట్టిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఆదాయ పన్ను శాఖ అధికారుల ల్యాప్​టాప్​పై గందరగోళం నెలకొంది. ఐటీ అధికారి రత్నకుమార్‌ ల్యాప్‌టాప్‌ చోరీకి గురైందని.. మంత్రి మల్లారెడ్డిపై పోలీసులకు ఫిర్యాదు చేయగా మంత్రిపై కేసు నమోదు చేశారు. అయితే ఈ క్రమంలోనే ల్యాప్‌టాప్‌ను మంత్రి అనుచరులు పోలీసులకు అప్పగించారు.

Laptop Issue Between IT officials And Mallareddy: మంత్రి మల్లారెడ్డి నివాసంలో సోదాలు నిర్వహించిన ఆదాయపు పన్ను శాఖ అధికారుల ల్యాప్‌టాప్​పై గందరగోళం కొనసాగుతోంది. ఐటీ అధికారి రత్నకుమార్‌ ల్యాప్‌టాప్‌ చోరీ అయిందని.. అందులో ఉన్న విలువైన డాటా తొలగించారని.. మంత్రి మల్లారెడ్డిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు మల్లారెడ్డిపై కేసు నమోదు చేశారు. అయితే ల్యాప్‌టాప్‌ను మంత్రి అనుచరులు పోలీసులకు అప్పగించారు.

పోలీసులు ల్యాప్‌టాప్‌ స్వాధీనం చేసుకుని.. ఐటీ అధికారులు తీసుకువెళ్లాలని సమాచారం అందించారు. అయినప్పటికీ ఆదాయపు పన్ను శాఖ అధికారులు తీసుకెళ్లలేదు. ల్యాప్‌టాప్‌లో కీలక సమాచారం ఉందని ఐటీ అధికారులు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. ఆ ల్యాప్‌టాప్‌ తనది కాదని ఐటీశాఖ అధికారి రత్నాకర్‌ చెప్పారు. ప్రస్తుతం ల్యాప్‌టాప్‌ బోయిన్‌పల్లి పోలీసుల వద్ద ఉంది.

అసలేం జరిగిదంటే: మంత్రిపై మల్లారెడ్డిపై రత్నాకర్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ‘విధి నిర్వహణలో భాగంగా ఆసుపత్రికి వెళ్లి సెర్చ్‌ ప్రొసీడింగ్స్‌ సిద్ధం చేస్తుండగా.. మంత్రి తన అనుచరులతో వచ్చి ఆధారాల్ని ధ్వంసం చేసేందుకు ప్రయత్నించారు. నా నుంచి సెల్‌ఫోన్‌, ల్యాప్‌టాప్‌, వారంట్లను లాక్కున్నారు. వాటిని చించేసే ప్రయత్నం చేశారు. నా విధుల్ని అడ్డుకున్నారు’ అంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో పోలీసులు మల్లారెడ్డిపై ఐపీసీ సెక్షన్లు 379 (చోరీ), 342 (బలవంతంగా నిర్బంధించడం), 353 (దాడి), 201 (నేర ఆధారాల్ని మాయం చేయడం), 203 (నేరానికి సంబంధించి తప్పుడు సమాచారం ఇవ్వడం), 504 (ఉద్దేశపూర్వకంగా అవమానించడం), 506 రెడ్‌విత్‌ 34 (నేరపూరిత బెదిరింపు) కింద కేసు నమోదు చేశారు.

ఇవీ చదవండి:మల్లారెడ్డి X ఐటీ.. ఆ మూడ్రోజులు ఏం జరిగిందంటే..?

సిట్ నోటీసులపై హైకోర్టును ఆశ్రయించిన భాజపా నేత బీఎల్ సంతోష్

స్వలింగ సంపర్కుల వివాహాలపై కేంద్రానికి సుప్రీం నోటీసులు

ABOUT THE AUTHOR

...view details