KMC Pg Medical Student health Update వరంగల్ ఎంజీఎంలో పీజీ విద్యార్థిని సీనియర్ వేధింపులు తాళలేక ఆత్మహత్యాయత్నం చేసిన ప్రీతి ఆరోగ్యం అత్యంత విషమంగా మారింది. ఆమె ఆరోగ్యం ఏమాత్రం మెరుగుపడకపోగా.. మరింత క్షీణించిందని డాక్టర్లు హెల్త్ బులిటెన్‌లో తెలిపారు. వెంటిలేటర్‌పైనే చికిత్స అందిస్తున్నామని వైద్యులు పేర్కొన్నారు. నిపుణుల బృందం ఆధ్వర్యంలో చికిత్స అందిస్తున్నట్లు వివరించారు.
ప్రీతి బతికొస్తుందని ఏమాత్రం ఆశలు లేవని ఆమె తండ్రి నరేంద్ర అన్నారు. శరీర రంగు మారుతోందని.. మొదటి రోజుతో పోల్చితే చాలా క్షీణించిందన్నారు. ఏదైనా అద్భుతం జరుగుతుందేమోనని ఆశిస్తున్నట్లు తెలిపారు. మరోవైపు ఇక వైద్య విద్యార్థిని ఆరోగ్యంపై రాజకీయ ప్రముఖులు ఆరా తీస్తున్నారు. తాజా నిమ్స్ ఆస్పత్రికి బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ వెళ్లారు. వైద్య విద్యార్థిని ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకున్నారు. మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు.
KMC Pg Medical Student Suicide attempt Update: ఇక వైద్యవిద్యార్థిని తన తల్లితో మాట్లాడిన ఓ ఆడియో బయటకు వచ్చిన విషయం తెలిసిందే. తన బాధను తల్లితో పంచుకున్నట్లు ఆడియో వింటే అర్థం అవుతోంది. సైఫ్ తనతో సహా చాలా మంది జూనియర్లను వేధిస్తున్నారని తల్లితో చెప్పుకుని వైద్యవిద్యార్థిని ఆవేదన చెందింది. సీనియర్లు అంతా ఒకటిగా ఉన్నారని బాధపడింది. పోలీసులతో సైఫ్‌కు నాన్న ఫోన్ చేయించినా లాభం లేదని తల్లితో చెప్పుకుంటూ కుమిలిపోయింది.