తెలంగాణ

telangana

బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్రకు హైకోర్టు గ్రీన్‌సిగ్నల్‌

By

Published : Aug 25, 2022, 5:10 PM IST

Updated : Aug 25, 2022, 6:18 PM IST

Bandi Sanjay Praja Sangrama Yatra allowed by High Court
బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్రకు హైకోర్టు గ్రీన్‌సిగ్నల్‌

17:09 August 25

ప్రజా సంగ్రామ యాత్రకు హైకోర్టు అనుమతి

TS High Court on Praja Sangrama Yatra: భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్రకు హైకోర్టు అనుమతినిచ్చింది. పాదయాత్ర ఆపాలని పోలీసులు ఇచ్చిన నోటీసు సస్పెండ్ చేస్తున్నట్లు ఉన్నత న్యాయస్థానం పేర్కొంది. పోలీసుల నోటీసులు రాజ్యాంగ విరుద్ధంగా ఉన్నాయని న్యాయస్థానం అభిప్రాయపడింది. ధర్మాసనం ఆదేశాలతో బండి సంజయ్ రేపటి ఉదయం నుంచి మూడో విడత ప్రజాసంగ్రామ యాత్ర పునఃప్రారంభించనున్నారు. షెడ్యూల్ ప్రకారం ఇవాళ యాత్ర ఎక్కడ ముగుస్తుందో అక్కడి నుంచి పున‌ఃప్రారంభం కానుంది. ఈనెల 27న మూడో ప్రజా సంగ్రామ యాత్ర ముగియనుంది. పాదయాత్ర ముగింపు సందర్భంగా హనుమకొండలో బహిరంగ సభ ఏర్పాటు చేయనున్నారు. ఈ సభకు భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా హాజరుకానున్నారు.

ఆగస్టు 23న బండి సంజయ్ చేపట్టిన ప్రజా సంగ్రామ యాత్రను నిలిపివేయాలని పోలీసులు నోటీసులు జారీచేశారు. పాదయాత్ర ప్రముఖ్ డాక్టర్ గంగిడి మనోహర్ రెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి, దుగ్యాల ప్రదీప్ కుమార్‌లకు వర్దన్నపేట ఏసీపీ ఈ తాఖీదులు ఇచ్చారు. జనగామ జిల్లాలో ప్రజాసంగ్రామ యాత్రకు అనుమతి లేదని నోటీసులో పేర్కొన్నారు. పాదయాత్ర పేరిట విద్వేషపూరిత ప్రకటనలు చేస్తున్నారని... ధర్మదీక్ష పేరుతో వివిధ జిల్లాల నుంచి భారీ ఎత్తున జన సమీకరణ చేస్తున్నారని పేర్కొన్నారు. రెచ్చగొట్టే ప్రకటనలతో, ఇతర జిల్లాల నుంచి కార్యకర్తలను రప్పిస్తుండటంతో జిల్లాలో శాంతిభద్రతల విఘాతం ఏర్పడే ప్రమాదం ఉందని తెలిపారు.

దీంతో తక్షణమే ప్రజా సంగ్రామ యాత్రను నిలిపేయాలని నోటీసులో పేర్కొన్నారు. నోటీసును పరిగణలోకి తీసుకోకుండా తిరిగి ప్రజా సంగ్రామ యాత్రను ప్రారంభిస్తే శాంతిభద్రతల సమస్య కింద చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు స్పష్టం చేశారు. అయితే పాదయాత్రను అనుమతించాలంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. విచారణ జరిపిన హైకోర్టు.. బండి సంజయ్‌ ప్రజా సంగ్రామ యాత్రకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

ఇవీ చదవండి:

Last Updated :Aug 25, 2022, 6:18 PM IST

ABOUT THE AUTHOR

...view details