తెలంగాణ

telangana

నేటి నుంచే పదో విడత రైతుబంధు నిధుల విడుదల

By

Published : Dec 27, 2022, 7:04 PM IST

Updated : Dec 28, 2022, 6:11 AM IST

10th installment of Rythubandhu scheme in the state from tomorrow
పదో విడత రైతుబంధు నిధులు విడుదలపదో విడత రైతుబంధు నిధులు విడుదల కానున్నాయి

Rythubandhu in Telangana : రాష్ట్రంలో ప్రభుత్వం 10వ విడత రైతుబంధు నిధులు రైతుల ఖాతాల్లో జమ చేయనుంది. అర్హులైన 70.54 లక్షల మంది రైతుల ఖాతాల్లో నేటి నుంచి ఎకరానికి రూ.5 వేలు జమ కానున్నాయి. గత వానాకాలంలో 65 లక్షల రైతులకు రూ.743.67 కోట్ల రైతుబంధు నిధులు పంపిణీ చేసినట్లు వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్​రెడ్డి తెలిపారు.

Rythubandhu in Telangana : రైతులకు తీపి కబురు. రాష్ట్రంలో నేటి నుంచి రైతుబంధు పథకం కింద రైతులకు‌ పెట్టుబడి రాయితీ సొమ్ము విడుదల కానుంది. 10వ విడత రైతుబంధు సాయం కింద రూ.7,676.61 కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేసేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. అర్హులైన 70.54 లక్షల మంది రైతుల ఖాతాల్లో నేటి నుంచి ఎకరానికి రూ.5 వేలు జమ కానున్నాయి. ఈ ఏడాది తాజా యాసంగి సీజన్‌లో కోటి 53 లక్షల 53 వేల ఎకరాలకు రైతుబంధు పెట్టుబడి రాయితీ సొమ్ము ఖాతాల్లో పడనుంది. మొత్తం పదో విడతతో కలిపి ఇప్పటి వరకు రైతుబంధు కింద రూ.65,559.28 కోట్లు రైతుల ఖాతాల్లోకి జమ అయినట్లు అవుతుంది. గత వానాకాలం 65 లక్షల మంది అర్హులైన రైతులకు రూ.7,434.67 కోట్ల రైతుబంధు నిధులు పంపిణీ చేసినట్లు వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి తెలిపారు.

అన్నం పెట్టే అన్నదాత యాచించే స్థితిలో కాదు.. శాసించే స్థానంలో ఉండాలన్నది ముఖ్యమంత్రి కేసీఆర్ ఆకాంక్ష అని అన్నారు. రైతు కేంద్రంగా పాలన సాగుతున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని మంత్రి కితాబిచ్చారు. రైతుబంధు, రైతుబీమా, సాగుకు ఉచిత విద్యుత్ సరఫరా, సాగు నీటి పారుదల రైతుల హక్కు అని స్పష్టం చేశారు. భారతదేశాన్ని పాలిస్తున్న పాలకులకు రైతుల పట్ల చిత్తశుద్ధి లేదని ఆక్షేపించారు. అబద్ధపు హామీలతో గద్దెనెక్కిన నరేంద్రమోదీ ఎనిమిదన్నరేళ్లైనా ఒక స్పష్టమైన వ్యవసాయ విధానాన్ని రూపొందించలేకపోయారని విమర్శించారు.

మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి వ్యవసాయం అనుసంధానం, 60 సంవత్సరాలు నిండిన రైతులకు పింఛను, వ్యవసాయ పంటల ఉత్పత్తులకు ప్రోత్సాహక మద్దతు ధరల విషయంలో ప్రఖ్యాత శాస్త్రవేత్త ప్రొఫెసర్ ఎంఎస్ స్వామినాథన్ కమిటీ సిఫార్సులు అమలు చేయడం లేదని ఆరోపించారు. 2022 నాటికి రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామన్న కేంద్రం ఇచ్చిన హామీల విషయంలో దేశ రైతాంగాన్ని దారుణంగా మోసం చేశారని ధ్వజమెత్తారు. రైతుల విషయంలో పాలకుల ఆలోచన మారాలని మంత్రి నిరంజన్‌రెడ్డి పేర్కొన్నారు.

ఇవీ చదవండి:

Last Updated :Dec 28, 2022, 6:11 AM IST

ABOUT THE AUTHOR

...view details