తెలంగాణ

telangana

Chanaka Korata project: పనులన్నీ పూర్తాయే.. పరిహారం ఇంకా రాకపాయె

By

Published : Nov 28, 2022, 9:54 AM IST

Chanaka Korata project

Chanaka Korata project: రాష్ట్ర నీటిపారుదల శాఖ చనాకా-కొరాటా ప్రాజెక్టుకు సాంకేతిక అనుమతుల కోసం ముమ్మర కసరత్తు చేస్తున్న వేళ.. ప్రాజెక్టు కింద మిగిలి ఉన్న పనులు చర్చనీయాంశంగా మారాయి. నిర్మాణానికి భూ సేకరణ ప్రక్రియ అంతా పూర్తయిన ప్రభుత్వం నుంచి బాధితులకు పరిహారం ఇంకా రావల్సి ఉంది.

Chanaka Korata project: నీటిపారుదల శాఖ చనాకా-కొరాటా ప్రాజెక్టుకు సాంకేతిక అనుమతుల కోసం ముమ్మర కసరత్తు చేస్తున్న వేళ.. ప్రాజెక్టు కింద మిగిలి ఉన్న పనులు చర్చనీయాంశంగా మారాయి. ఆదిలాబాద్‌ జిల్లాలోని కరవు ప్రాంతాలకు సాగునీటిని అందించేందుకు దిగువ పెన్‌గంగపై చనాకా- కొరాటా ప్రాజెక్టు నిర్మిస్తున్నారు. ఇప్పుడిది వెట్‌రన్‌కు సిద్ధమయింది. వచ్చే నెలాఖరులోపు పంపుహౌసు నుంచి ప్రధాన కాలువలోకి నీటిని ఎత్తిపోసి పరీక్షించనున్నారు.

ఆదిలాబాద్‌ జిల్లాలో జైనథ్‌, బేల, భీంపూర్‌ మండలాల పరిధిలో 37వేల ఎకరాలకు సాగునీరు అందించే ఈ ప్రాజెక్టుపై ఇక్కడి ప్రజలు ఆశలు పెట్టుకున్నారు. ప్రధాన పనులన్నీ పూర్తి కావచ్చినా ఆయకట్టుకు సాగునీటిని చేర్చే ఉప కాలువలు, డిస్ట్రిబ్యూటరీల నిర్మాణం నేటికీ ప్రారంభించలేదు. నిర్మాణానికి భూ సేకరణ ప్రక్రియ అంతా పూర్తయింది. ప్రభుత్వం నుంచి పరిహారం రావడం ఒక్కటే మిగిలి ఉంది.

900 ఎకరాలు లక్ష్యం: రూ.795.94 కోట్ల అంచనా వ్యయంతో నిర్మిస్తున్న ఈ ప్రాజెక్టులో బ్యారేజీ, పంపుల బిగింపు(రెండు పంపుహౌసులు-6), 42 కిలోమీటర్ల ప్రధాన కాలువ పనులన్నీ దాదాపు పూర్తయ్యాయి. 47 నుంచి 89వ కిలోమీటరు వరకు ప్రధాన కాలువ నీటి ప్రవాహానికి సిద్ధంగా ఉంది. బ్యారేజీ నుంచి ఎత్తిపోసే నీరు 47వ కిలోమీటరు వద్ద ఈ కాలువలోకి చేరుతుంది. ఇక్కడి నుంచి దిగువకు నీరు ప్రవహించినా ఉప కాలువలు, పిల్ల కాలువల నిర్మాణం చేయకపోవడంతో ప్రధాన కాలువకే పరిమితమవుతుంది.

ఉప కాలువల నిర్మాణానికి సుమారు 900 ఎకరాల భూ సేకరణ చేయాల్సి ఉంది. దీనిలో కనీసం 200 ఎకరాలైనా వచ్చే రెండు నెలల్లో సేకరిస్తే ఉప కాలువలకు నీరివ్వడానికి వీలుంటుంది. డిసెంబరులో రెండు పంపులను నడిపి నీటిని ఎత్తిపోసేందుకు పలు విధానాల(ప్రొటోకాల్‌)ను అనుసరించి పరీక్ష పూర్తి చేయనున్నారు. ఇది పూర్తికాగానే ఆయకట్టుకు నీటిని ఎత్తిపోస్తారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details