పరస్పర విరుద్ధ ప్రయోజనాల అంశంలో విమర్శలు ఎదుర్కొంటున్న బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్ గంగూలీ(Ganguly News).. ఏటీకే మోహన్ బగన్ ఫ్రాంచైజీ నుంచి వైదొలిగినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని ఐపీఎల్ వర్గాలు తెలిపాయి.
"ఏటీకే- మోహన్ బగన్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ నుంచి తప్పుకుంటున్నట్లు గంగూలీ తెలిపారు. ఈ మేరకు బోర్డుకు లేఖ పంపించారు." అని ఐపీఎల్ వర్గాలు పేర్కొన్నాయి.
కారణం అదే..
ఐపీఎల్లో రెండు కొత్త ఫ్రాంచైజీల కోసం ఇటీవల జరిగిన వేలంలో(IPL franchise auction) అహ్మదాబాద్‌ను రూ.5,625 కోట్లకు సీవీసీ క్యాపిటల్స్ పార్టనర్స్ సొంతం చేసుకోగా.. లఖ్‌నవూను(IPL new teams) రూ.7,090 కోట్లతో ఆర్పీఎస్జీ వెంచర్స్ అధినేత సంజీవ్ గోయంకా దక్కించుకున్నారు. అయితే సంజీవ్‌కు ఐపీఎల్ ఫ్రాంచైజీ దక్కడంలో గంగూలీ కీలకంగా వ్యవహరించినట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఇండియన్ సూపర్ లీగ్‌లో(ఐఎస్ఎల్) సంజీవ్ గోయంకా ఛైర్మన్‌గా ఉన్న ఏటీకే-మోహన్ బగన్ ఫ్రాంచైజీ బోర్డు ఆఫ్ డైరెక్టర్స్‌లో గంగూలీ సభ్యుడుగా ఉండటమే ఇందుకు ప్రధాన కారణం. పూర్తి కథనం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
ఇదీ చదవండి:
IPl New Teams: 'కొత్త జట్లతో దేశవాళీ క్రికెటర్లకు మేలు'
IPL 2021: ఆ జట్టు ఖరీదు రూ.7,000 కోట్లు కాదు.. రూ.2,000 కోట్లే!