ఐపీఎల్ 2021(ipl 2021 live) రెండో దశలో భాగంగా నేడు(సెప్టెంబర్ 24) చెన్నై సూపర్ కింగ్స్-రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(csk vs rcb 2021) మధ్య మ్యాచ్ జరగనుంది. సెకండ్ ఫేజ్ తొలి మ్యాచ్(rcb vs kkr 2021)ను ఓటమితో ప్రారంభించిన కోహ్లీసేన ఈ మ్యాచ్‌లో ఎలాగైన గెలవాలన్న పట్టుదలతో ఉంది. కోల్‌కతాతో జరిగిన మ్యాచ్‌లో కేవలం 92 పరుగులకే ఆలౌటైన ఈ జట్టు చెన్నైపై భారీ విజయం సాధించాలని ఉవ్విళ్లూరుతోంది. మరోవైపు పటిష్ట ముంబయి జట్టు(mi vs csk 2021)పై అద్భుత విజయంతో ఆత్మవిశ్వాసంతో ఉన్న ధోనీసేన ఈ మ్యాచ్‌లోనూ గెలిచి పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలోకి వెళ్లాలని భావిస్తోంది. మరి ఈ రెండు జట్లలో విజయమెవరిదో తెలియాలంటే మరికొన్ని గంటలు ఆగాల్సిందే. ఈ మ్యాచ్(csk vs rcb 2021) రాత్రి 7.30 గంటల నుంచి ప్రత్యక్ష ప్రసారం కానుంది.
కోహ్లీసేన గట్టెక్కేనా..!
ప్లే ఆఫ్స్ రేసులో నిలవాలంటే బ్యాటింగ్ విభాగంలో ఆర్సీబీ గాడిన పడాల్సిన అవసరం ఉంది. ఓపెనర్లు దేవదత్ పడిక్కల్ (217), విరాట్ కోహ్లీ (203) జట్టుకు అవసరమైన పరుగులు సాధించడంలో కృషి చేస్తే మిడిలార్డర్‌పై ఒత్తిడి తగ్గే వీలుంది. ముఖ్యంగా కోల్‌కతా(rcb vs kkr 2021)తో జరిగిన మ్యాచ్‌లో టాపార్డర్‌తో పాటు మిడిలార్డర్ కూడా దారుణంగా విఫలమైంది (పూర్తి కథనం కోసం ఇక్కడ క్లిక్ చేయండి). సీఎస్కేతో మ్యాచ్‌లో ఓపెనర్లతో పాటు మ్యాక్స్‌వెల్ (233), డివిలియర్స్ (207) బ్యాట్‌కు పని చెప్పాలని అభిమానులు భావిస్తున్నారు. బౌలింగ్ విభాగంలోనూ సత్తాచాటాల్సిన అవసరం ఉంది. గత మ్యాచ్‌లో సిరాజ్, హర్షల్ పటేల్ పర్వాలేదనిపించారు. జేమీసన్, చాహల్, హసరంగ ఓవర్‌కు 10కిపైగా పరుగులు సమర్పించుకున్నారు. పటిష్ట ధోనీసేనపై గెలవాలంటే బౌలింగ్ విభాగం సమష్టిగా రాణించాల్సి ఉంటుంది.
సీఎస్కే జోరు