తెలంగాణ

telangana

ధోనీ సూపర్​ రికార్డ్​.. ఐపీఎల్​ చరిత్రలో ఎవరికీ సాధ్యం కానీ..

By

Published : May 9, 2022, 10:28 AM IST

dhoni death over runs

IPL 2022 DC VS CSK dhoni record: దిల్లీతో జరిగిన మ్యాచ్​లో 91 పరుగులు భారీ తేడాతో సీఎస్కే గెలిచింది. అయితే ఈ మ్యాచ్​లో చెన్నై జట్టు సహా కెప్టెన్​ ధోనీ ఓ అరుదైన రికార్డు సాధించారు. అదేంటంటే..

IPL 2022 Dhoni death over runs: ఈ ఐపీఎల్​లో భాగంగా దిల్లీ క్యాపిటల్స్​తో జరిగిన మ్యాచ్​లో సీఎస్కే కెప్టెన్ ధోనీ అరుదైన ఫీట్​ సాధించాడు. ఈ లీగ్​ డెత్​ ఓవర్లలో 2500 పరుగులు చేసిన తొలి బ్యాటర్​గా రికార్డు నెలకొల్పాడు. 15 ఏళ్ల మెగాలీగ్​ చరిత్రలో ఈ ఘనత మరెవరికీ సాధ్యం కాలేదు. అంతర్జాతీయ క్రికెట్​కు గుడ్​బై చెప్పినప్పటికీ తనలో ఫినిషనర్​ ఇంకా బతికే ఉన్నాడని అవకాశం దొరికినప్పుడల్లా రుజువు చేస్తూనే ఉన్నాడు. కాగా, దిల్లీతో జరిగిన మ్యాచ్​లో సీఎస్కే 200 పరుగుల మార్క్​ను దాటడంలో కీలక పాత్ర పోషించాడు ధోనీ. ఇన్నింగ్స్​ ఆఖర్లో బ్యాటింగ్​కు వచ్చిన మహీ 8 బంతుల్లో 21 పరుగులు చేశాడు. ఇందులో 2 సిక్స్​లు, ఒక్క ఫోర్​ ఉన్నాయి.

ఇదే మ్యాచ్​తో మహీ మరో రికార్డును సాధించాడు. టీ20ల్లో కెప్టెన్​గా ఆరువేల మైలురాయిని అందుకున్నాడు. మొత్తంగా టీ20 కెప్టెన్​గా 186 ఇన్నింగ్స్​లో 6015 రన్స్​ చేశాడు. ధోనీ కన్నా ముందుకు ఆర్సీబీ మాజీ సారథి కోహ్లీ ఒక్కడే ఆరు వేల పరుగులు చేశాడు.

లీగ్​ చరిత్రలో నాలుగోసారి.. ఐపీఎల్​ 2022లో ఇప్పటికే ప్లేఆఫ్​ అవకాశాలు కోల్పోయినప్పటికీ దిల్లీతో జరిగిన మ్యాచ్​లో సీఎస్కే అద్భుత విజయాన్ని నమోదు చేసింది. 91 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది. ఈ విజయంతో పాయింట్ల పట్టికలో ఎనిమిదో స్థానానికి చేరినప్పటికీ ప్లే ఆఫ్స్​ ఛాన్స్​లు లేవు. అయితే ఈ విజయం దిల్లీ క్యాపిటల్స్​ ప్లే ఆఫ్స్​ ఆశలను గల్లంతు చేసింది. కాగా, ఐపీఎల్​ చరిత్రలో చెన్నై ఒక మ్యాచ్​ను భారీ తేడాతో నెగ్గడం ఇది నాలుగోసారి. అంతకముందు 2015లో పంజాబ్​ కింగ్స్​పై 97 పరుగులు తేడాతో గెలవగా.. 2014లో దిల్లీ డేర్​డెవిల్స్​పై 93, 2009లో ఆర్సీబీపై 92 రన్స్​ తేడాతో భారీ విజయాలు అందుకుంది.

కాగా, ఈ మ్యాచ్​లో తొలుత టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేసిన చెన్నై నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 208 పరుగులు చేసింది. అనంతరం లక్ష్య ఛేదనలో దిల్లీ 117 పరుగులకే ఆలౌటైంది. దిల్లీ బ్యాటర్లలో మిచెల్ మార్ష్ (25), శార్దూల్‌ ఠాకూర్ (24), రిషభ్‌ పంత్ (21), డేవిడ్ వార్నర్ (19) మాత్రమే రెండంకెల స్కోరును సాధించారు. చెన్నై బౌలర్లలో మొయిన్ అలీ 3, బ్రావో 2, ముకేశ్‌ చౌదరి 2, సిమర్‌జిత్ సింగ్ 2, తీక్షణ ఒక వికెట్ తీశారు. ఈ ఓటమితో దిల్లీ (10) తన ప్లేఆఫ్స్ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. మరోవైపు అద్భుత విజయం సాధించిన చెన్నై (8) పాయింట్ల పట్టికలో ఎనిమిదో స్థానానికి చేరుకుంది.

ఇదీ చూడండి: సన్​రైజర్స్​ గెలవాలంటే.. ఈ ప్లేయర్స్​ రాణించాల్సిందే!

ABOUT THE AUTHOR

...view details