తెలంగాణ

telangana

కోహ్లీ సరే.. భువనేశ్వర్​ ఏం చేశాడు.. హీరో ఆరాధన పనికిరాదు : గంభీర్

By

Published : Sep 20, 2022, 9:42 AM IST

gautam gambhir virat kohli

ఎప్పుడూ వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచే గౌతమ్​ గంభీర్.. తాజాగా మళ్లీ ఆసక్తికర కామెంట్లు చేశారు. క్రికెట్లో 'హీరో ఆరాధన' గురించి మాట్లాడాడు. అలాగే 2011 వరల్డ్​ కప్ సెమీ ఫైనల్​ సందర్భంగా ఎవ్వరికీ తెలియని ఓ సంఘటన గురించి పంచుకున్నాడు.

Gautam Gambhir On Virat Kohli : ఎప్పుడూ ముక్కుసూటిగా మాట్లాడే భారత మాజీ ఓపెనర్‌ గంభీర్‌.. మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. క్రికెట్‌లో ప్లేయర్ల 'హీరో ఆరాధన' గురించి మాట్లాడాడు. ఒకరిని ఆరాధించడం వల్ల మరొకరి ఘనతలను గుర్తించడంలేదని వ్యాఖ్యానించాడు. ఆసియా కప్‌లో అఫ్గానిస్థాన్‌పై విరాట్‌ కోహ్లీ, భువనేశ్వర్‌ కుమార్‌ ప్రదర్శనలను ఉదాహరణగా చెప్పడు. అలాగే 2011 ప్రపంచ కప్​ సందర్భంలో డ్రెస్సింగ్ రూంలో జరిగిన ఓ సంఘటన గురించి పంచుకున్నాడు.

ఆసియా కప్‌ సూపర్‌-4లో ఓటములతో ఫైనల్‌కు చేరుకోలేకపోయిన టీమ్‌ఇండియా.. అఫ్గాన్‌తో జరిగిన మ్యాచ్‌లో చెలరేగింది. అంతర్జాతీయ క్రికెట్లో దాదాపు 1000 రోజుల తర్వాత మాజీ కెప్టెన్ విరాట్‌ కోహ్లీ సెంచరీ చేశాడు. 122 పరుగులతో టీ20ల్లో మొట్టమొదటి శతకం నమోదు చేశాడు. దీంతో ప్రస్తుత, మాజీ క్రికెటర్లతోపాటు నెటిజన్లు కోహ్లీపై ప్రశంసలు కురిపించారు. కాగా ఇదే విషయంపై గంభీర్‌ తాజాగా మాట్లాడాడు. కోహ్లీనే అందరూ కొనియాడారని.. ఫలితంగా అద్భుతంగా బౌలింగ్‌ చేసి 5 వికెట్ల ప్రదర్శన చేసిన భువనేశ్వర్‌ కుమార్‌ ఘనతను ఎవరూ గుర్తించలేదన్నాడు. 'హీరో ఆరాధన' కారణంగానే ఇలాంటి సమస్యలు తలెత్తుతాయని పేర్కొన్నాడు.

'కోహ్లీ సెంచరీ కొట్టిన మ్యాచ్‌లోనే మీరట్‌ అనే చిన్న పట్టణం నుంచి వచ్చిన యువకుడు (భువనేశ్వర్‌ కుమార్‌) ఐదు వికెట్లు తీశాడు. కానీ ఎవరూ అతడి గురించి మాట్లాడలేదు. ఇది చాలా దురదృష్టకరం. 4 ఓవర్లు వేసి 5 వికెట్లు తీస్తే అతడిని ఎవరూ గుర్తించలేదు. కానీ కోహ్లీ శతకం చేస్తే దేశమంతటా సంబరాలు చేసుకొన్నారు. హీరో ఆరాధన నుంచి బయటపడాలి. హీరోలుగా ఆరాధించడం మానేయాలి అది క్రికెట్‌ అయినా, రాజకీయాలైనా. ఆటగాళ్లను కాకుండా జట్టు మొత్తాన్ని అభిమానించాలి' అని ఓ వార్తాసంస్థ అడిగిన ప్రశ్నకు గంభీర్‌ ఈ విధంగా సమాధానమిచ్చాడు.

'మ్యాచ్​ మనమే గెలవాలి.. వాళ్ల పేరు తుడిచిపెట్టేయాలి..'
ఓ వార్త సంస్థతో 2011 ప్రపంచ కప్ భారత్-పాక్ సెమీ ఫైనల్​ సందర్భంలో డ్రెస్సింగ్​ రూంలో జరిగిన ఓ సంఘటన గురించి గంభీర్​ పంచుకున్నాడు. "​ఇద్దరు ముగ్గురు సీనియర్​ ప్లేయర్లు నా వద్దకు వచ్చి.. మనం ఎలాగైనా ఈ మ్యాచ్​ గెలవాలి. 1983 ప్రపంచ కప్​ గురించి చర్చను మళ్లించాలి. వాళ్ల గురించి ఎవరూ మాట్లాడకుండా చేయాలి అని చెప్పారు. దానికి.. ఎవరిని ఫినిష్​ చేయడానికి నేను ఇక్కడికి రాలేదు. ఎవరిని తగ్గించడానికి రాలేదు. ఈ మ్యాచ్​ గెలిచి.. మా పరిధిని విస్తరించాలి. 1983 నుంచి 2011 వరకు వారికి మీడియా జాబ్​ ఇస్తుంది అంటే అది మీడియా ప్రాబ్లమ్​, మాది కాదు. దేశానికి ఆనందం కలిగించడం కోసం మేము ఈ వరల్డ్​ కప్​ గెలవానుకుంటున్నాం" అని వారికి బదులిచ్చినట్లు గుర్తుచేసుకున్నాడు. ఈ మ్యాచ్​లో గంభీర్ 97 పరుగులు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు.
ఈ మ్యాచ్​లో భారత్​ 29 పరుగుల తేడాతో గెలిచింది. తర్వాత ముంబయిలో జరిగిన ఫైనల్​లో శ్రీలంకపై ఆరు వికెట్ల తేడాతో గెలిచి 28 ఏళ్ల తర్వాత రెండో వరల్డ్​ కప్​ సాధించింది.

ఇవీ చదవండి:'కోహ్లీకి ఏదీ అసాధ్యం కాదు.. గాడిలో పడితే చెలరేగడమే'

Legends League: క్రికెటర్​కు తప్పిన ప్రమాదం.. హోటల్​ గదిలో పాము కలకలం

ABOUT THE AUTHOR

...view details