తెలంగాణ

telangana

'భారీ షాట్లు ఆడటంలో పంత్ అదుర్స్​.. అందుకే ఓపెనర్​గా పంపాలి'.. డీకే ఆసక్తికర వ్యాఖ్యలు

By

Published : Nov 19, 2022, 1:35 PM IST

rishab pant
రిషభ్​ పంత్ ()

టీమ్​ఇండియా క్రికెటర్ రిషభ్​ పంత్ టీ20ల్లో ఓపెనింగ్​కు దిగాలని ఫినిషర్​​ దినేశ్ కార్తీక్ అభిప్రాయపడ్డాడు. అతడు టాపార్డర్‌లో బాగా ఆడతాడని స్పష్టం చేశాడు. ఇంకేమన్నాడంటే?

Dinesh Karthik Rishabh Panth: టీమ్​ఇండియాలో ప్రతిభావంతులైన ఆటగాళ్లు ఎంత మంది ఉన్నప్పటికీ సరైన ప్రణాళికలు లేక, జట్టు సెలక్షన్​ లాంటి సమస్యలతో గత కొన్నిరోజులుగా సతమతమవుతోంది. ఇందుకు ఆసియా కప్, టీ20 ప్రపంచకప్ వైఫల్యాలే ఉదాహరణ. ఫినిషర్ దినేశ్ కార్తీక్, రిషభ్​ పంత్ మధ్య పోటీ తీవ్రంగా ఉంది. అయితే కెప్టెన్ రోహిత్ శర్మ కూడా పంత్ కంటే కూడా దినేశ్ కార్తీక్‌కే తన ఓటు వేస్తున్నాడు. ఫలితంగా పంత్‌కు పెద్దగా అవకాశాలు రావడం లేదు. టీ20 ప్రపంచకప్‌లో చివరి రెండు మ్యాచ్‌లు మినహా మిగిలిన మ్యాచుల్లో పంత్​ను తీసుకోలేదు. కార్తీక్ ఫినిషర్‌గా వస్తుండటంతో పంత్​ను ఏ పొజిషన్‌లో ఆడించాలనే విషయంపై సతమతమవుతున్నారు. తాజాగా ఈ అంశంపై దినేశ్ కార్తీక్ స్పందించాడు.

రిషభ్​ పంత్ టాపార్డర్‌లో వస్తే బెనిఫిట్ చాలా ఉంటుందని స్పష్టం చేశాడు. "భారీ షాట్లు ఆడటంలో పంత్ సామర్థ్యం గురించి అందరికీ తెలుసు, ఫీల్డర్లు ఇన్నర్ సర్కిల్‌లో ఉన్నప్పుడు పవర్ ప్లేలో పంత్ లాంటి ఆటగాడు ఉండాలి. కాబట్టి అతడిని టాపార్డర్‌లో పంపిస్తే మెరుగ్గా రాణిస్తాడు. టెస్టు క్రికెట్‌లో ఇప్పటికే పంత్ తన స్థానాన్ని పదిలం చేసుకున్నాడు. అలాగే వన్డేల్లోనూ స్థిరంగా రాణిస్తున్నాడు. టీ20ల వద్దకు వచ్చేసరికి విభిన్న స్థానాల్లో బ్యాటింగ్ చేస్తున్నాడు. టీమ్​ఇండియా అతడు ఏ స్థానంలో బాగా ఆడతాడో గుర్తించి ఆ పొజిషన్‌లో పంపాలి" అంటూ దినేశ్ కార్తీక్​ చెప్పుకొచ్చాడు.

ప్రస్తుతం టీమ్​ఇండియా న్యూజిలాండ్ పర్యటనలో ఉంది. హార్దిక్ పాండ్య కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. తొలి టీ20 శుక్రవారం జరగాల్సి ఉండగా.. వర్షం కారణంగా రద్దయింది. రెండో టీ20 ఆదివారం జరగనుంది. టీ20 సిరీస్ తర్వాత వన్డే సిరీస్ ఆడనుంది భారత్. ఈ జట్టుకు శిఖర్ ధావన్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు.

ఇదీ చదవండి:ప్రపంచకప్​ ఎఫెక్ట్.. బీసీసీఐ కీలక నిర్ణయం.. జాతీయ సెలక్షన్ కమిటీపై వేటు

బోల్డ్​గా స్టార్​ క్రికెటర్​ పిక్​ వైరల్.. ​ రణ్​వీర్​ న్యూడ్​ ఫొటోకు లేటెస్ట్ వెర్షనా?

ABOUT THE AUTHOR

...view details