తెలంగాణ

telangana

'మేరీకోమ్ మహిళలకే కాదు అందరికీ ఆదర్శం'

By

Published : Oct 15, 2020, 9:05 PM IST

Kohli_Mary kom

భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ దిగ్గజ బాక్సర్ మేరీ కోమ్​తో ఇన్​స్టాగ్రామ్​ లైవ్​లో మాట్లాడాడు. స్టార్​ అథ్లెట్​గా రాణిస్తూనే మాతృత్వాన్ని ఎలా ఆస్వాదించారని మేరీ కోమ్​ని అడుగుతూ పలు సూచనలు తీసుకున్నాడు.

'పుమా ఇండియా' ఇన్​స్టాగ్రామ్ లైవ్​ చాట్​లో దిగ్గజ బాక్సర్​ మేరీ కోమ్​తో మాట్లాడాడు టీమ్​ఇండియా సారథి విరాట్​ కోహ్లీ. ఈ సందర్భంగా అతడు మేరీని కొన్ని ఆసక్తికరమైన ప్రశ్నలు అడిగాడు.

వచ్చే ఏడాది జనవరి కల్లా తండ్రి కాబోతున్న విరాట్​ కోహ్లీ.. స్టార్​ అథ్లెట్​గా రాణిస్తూనే పిల్లలను ప్రేమతో పెంచడాన్ని ఎలా ఆస్వాదించాలో చెప్పాలని మేరీ కోమ్​ను సలహా అడిగాడు. నలుగురు పిల్లలకు తల్లి అయిన మేరీ కోమ్​ బాక్సింగ్​ ఛాంపియన్​గా అవతరించడం ఆదర్శప్రాయమని కొనియాడాడు. మేరీ నుంచి చాలా నేర్చుకున్నానని వెల్లడించాడు.

కోహ్లీ అడిగిన ప్రశ్నకు స్పందించిన మేరీకోమ్..​ ముందుగా కోహ్లీ-అనుష్క జంటకు అభినందనలు తెలిపింది.

" పెళ్లైన తర్వాత నా భర్త నాకు అండగా నిలిచాడు. ఏ విషయంలోనూ ఆయన నా అభిప్రాయాన్ని కాదనలేదు. ఆయన గొప్ప భర్త మాత్రమే కాదు గొప్ప తండ్రి కూడా."

-మేరీ కోమ్​, దిగ్గజ బాక్సర్.

మేరీ.. అందరికీ ఆదర్శం

దేశంలోని మహిళలకు మాత్రమే కాదు మేరీ కోమ్​ అందరికీ ఆదర్శమేనని విరాట్​ కోహ్లీ ప్రశంసించాడు. అన్ని ఒడుదొడుకులు ఎదుర్కొంటూ ఆమె సాధించిన ఘనత వర్ణనాతీతమని అన్నాడు. దిగ్గజ బాక్సర్​ను ప్రశ్నించే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నానని వెల్లడించాడు.

కోహ్లీ వ్యాఖ్యలపై స్పందించిన మేరీ కోమ్.. తన జీవితంలోని విషయాలు చర్చించడానికి కనీసం మూడు రోజులైనా పడుతుందని నవ్వుతూ పేర్కొంది. దేశంలోని అథ్లెట్లందరూ వారి లక్ష్యం నేరవేర్చుకునే దిశగానే అడుగులేయాలని సూచించింది.

కరోనా కారణంగా టోక్యో ఒలింపిక్స్ వాయిదా పడటంపై అసహనం వ్యక్తం చేసింది మేరీ. ఈ వార్త తనకు ఆశ్చర్యాన్ని కలగించిందని వ్యాఖ్యానించింది.

ఇదీ చదవండి:గూగుల్ మరో తప్పిదం.. ఈసారి సచిన్ కుమార్తెకు పెళ్లి!

ABOUT THE AUTHOR

...view details