తెలంగాణ

telangana

మరో కథతో చైతూ.. ఇంట్రెస్టింగ్ స్టోరీతో 'ఐరావతం'

By

Published : Dec 29, 2021, 9:36 AM IST

Tollywood latest updates 2021: కొత్త సినిమా అప్డేట్స్​ వచ్చాయి. అక్కినేని నాగచైతన్య కొత్త సినిమా, 'ఐరావతం', 'యజ్ఞ' మొదలైన చిత్రాల విశేషాలు ఇందులో ఉన్నాయి.

nagachaitanya, iravatam
నాగచైతన్య

Tollywood latest updates 2021: ఈ ఏడాది 'లవ్‌స్టోరి'తో విజయాన్ని అందుకున్న నాగచైతన్య ప్రస్తుతం 'బంగార్రాజు', 'థ్యాంక్‌యూ' చిత్రాలతో బిజీ బిజీగా గడుపుతున్నారు. వచ్చే ఏడాది ఈ రెండు చిత్రాలూ వరుసగా ప్రేక్షకుల ముందుకొస్తాయి. మరో పక్క చైతూ కోసం కొత్త కథలు సిద్ధం అవుతున్నాయి. పలువురు యువ దర్శకులు ఆయన కోసం కథల్ని సిద్ధం చేసి వినిపించారు. దర్శకురాలు నందినిరెడ్డి కూడా చైతన్య కోసం ఓ కథని సిద్ధం చేసి వినిపించినట్టు తెలుస్తోంది. వచ్చే ఏడాది ఈ సినిమాపై స్పష్టత వచ్చే అవకాశాలున్నాయి.

నాగచైతన్య

'ఐరావతం' ఆసక్తికరం

Iravatham Telugu Movie: అమర్‌దీప్‌, తన్వి, అరుణ్‌, ఎస్తేర్‌ నాయకానాయికలుగా నటించిన చిత్రం 'ఐరావతం'. సుహాస్‌ మీరా దర్శకత్వం వహిస్తున్నారు. రాంకీ పలగాని, లలిత కుమారి తోట, బాలయ్యచౌదరి చల్లా నిర్మాతలు. ఈ చిత్రంలోని 'ఓ నా దేవేరి' పాట లిరికల్‌ వీడియోని బిగ్‌బాస్‌-5 సభ్యులైన నటరాజ్‌ మాస్టర్‌, లోబో, మానస్‌, కాజల్‌, ప్రణీత్‌తో కలిసి నరేంద్రకుమార్‌ విడుదల చేశారు. దర్శకుడు మాట్లాడుతూ "ఓ కొత్త కథని ప్రేక్షకులకు చెప్పాలనే ప్రయత్నమే ఈ చిత్రం. ఇందులోని ఐరావతం అనే ఓ ముఖ్య పాత్రతోపాటు, తెలుపు రంగులోని కెమెరా కీలకం. ఆ కెమెరా క్లిక్‌ చేస్తే జరిగే మేజిక్‌ ఏమిటి? అది ఒకరి చేతికి వచ్చాక వాళ్లు పడిన ఇబ్బందులు ఎలాంటివన్నది ఆసక్తికరం. కథనం కట్టిపడేసేలా ఉంటుంది" అన్నారు. "నా దేవేరి పాటకి లభిస్తున్న స్పందన చాలా బాగుంది. రామ్‌ మిరియాల పాటకు ప్రాణం పోస్తూ ఆలపించారు. సత్య సమకూర్చిన బాణీ చాలా బాగుంది. త్వరలోనే చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామ'ని తెలిపారు నిర్మాతలు.

'యజ్ఞ' ఆరంభం..

సుగమ్య శంకర్‌, నందిని, రాఘవ, చరణ్‌ జడ్చర్ల ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం 'యజ్ఞ'. చిత్తజల్లు ప్రసాద్‌ దర్శకత్వం వహిస్తున్నారు. పొందూరి రామ్మోహన్‌రావు నిర్మాత. ఈ చిత్రం మంగళవారం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ముహూర్తం సన్నివేశానికి నిర్మాత ప్రతాని రామకృష్ణ గౌడ్‌ క్లాప్‌నిచ్చారు. సాయివెంకట్‌ కెమెరా స్విచ్చాన్‌ చేశారు. అనంతరం దర్శకుడు మాట్లాడుతూ "హారర్‌ అంశాలతో కూడిన రొమాంటిక్‌ కామెడీ చిత్రమిది. కొత్త పాత నటులు కలయికలో రూపొందుతోంద"న్నారు. నిర్మాత మాట్లాడుతూ "కొత్త రకమైన ఈ కథ నచ్చడం వల్లే సినిమాని ఆరంభించాం" అన్నారు. పేరు బాగుందని మెచ్చుకున్నారు అతిథులు. ఈ కార్యక్రమంలో గూడూరు చెన్నారెడ్డి, విజయలక్ష్మి, మారంరెడ్డి కొండారెడ్డి, కొండపాక శ్రీరామమూర్తి తదితరులు పాల్గొన్నారు.

యజ్ఞ

ఇదీ చదవండి:

'రాజమౌళితో పని చేయడం సవాల్.. కష్టమైనా ఇష్టపడి చేశా'

Akhanda Producer: 'సినిమా 'అఖండ' విజయమని ముందే చెప్పేశా'

ABOUT THE AUTHOR

...view details