Smartphone features: 2022లో విడుదలయ్యే ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్లలో ఎలాంటి ఫీచర్లు ఉంటాయోనని ఎప్పుడైనా ఆలోచించారా? క్వాల్కామ్.. స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 1 ప్రాసెసర్ రాకతో వచ్చే ఏడాది ఫోన్లలో సరికొత్త ఫీచర్లు అందుబాటులోకి రానున్నాయి.
అయితే అన్ని స్మార్ట్ ఫోన్లలో ఈ చిప్ ఫీచర్ ఉండాలని లేదు కానీ.. హై ఎండ్ ఫోన్లు అయిన షియోమి, శాంసంగ్, ఒప్పో, సోనీ, వన్ ప్లస్ ఇతర మోడళ్లలో దీనిని పొందుపర్చే అవకాశాలు పుష్కలం.
మరి ఈ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 1 ఫ్లాగ్షిప్ ప్రాసెసర్‌తో ఏమేం ఫీచర్లు వస్తాయంటే..
Always-on camera
ఈ ప్రాసెసర్‌తో వచ్చే ఆసక్తికరమైన ఫీచర్లలో.. ఆల్వేస్ ఆన్ కెమెరా గురించి మొదట చెప్పుకోవాలి. మీ ఫోన్‌ను ముట్టుకోకుండానే ఎన్నో కెమెరా ఫీచర్లను పొందొచ్చు.
- ఫోన్‌ను కనీసం టచ్ చేయకుండానే.. ఫేషియల్ రికగ్నిషన్‌తో అన్‌లాక్ చేయొచ్చు.
- ప్రస్తుత ఆండ్రాయిడ్ ఫోన్లను స్టాండ్ బై మోడ్ నుంచి మేల్కొలిపేందుకు బటన్ ప్రెస్ చేయడం లేదా ఫోన్‌ను తీయడం ఉంటుంది. కానీ భవిష్యత్తులో ఇది అవసరం ఉండదు.
- ఫోన్ మీ పక్కన ఉన్నా ముట్టుకోకుండానే.. కెమెరా వైపు చూస్తే చాలు హోం స్క్రీన్ ఫ్లాష్ అయ్యి డిస్ప్లే ఓపెన్ అవుతుంది.
- ఫోన్‌ను అన్‌లాక్ చేయకుండానే.. క్యూఆర్ కోడ్లను కూడా స్కాన్ చేయొచ్చు.
8K HDR video shooting
2022లో రానున్న ఫీచర్లలో 8కే హెచ్డీఆర్ వీడియో షూటింగ్ ఒకటి.
- స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 1 ప్రాసెసర్‌తో కూడిన ఫోన్లతో.. 8K HDRలో వీడియోలు చేయొచ్చు. యాపిల్ ఐఫోన్ ప్రోలో కూడా వీడియో రికార్డింగ్ సామర్థ్యం 4K వరకే అందుబాటులో ఉంది.
- ఈ ఫీచర్‌తో అత్యుత్తమ రిజల్యూషన్‌లో వీడియో షూట్ చేయొచ్చు.
Video Bokeh effect