తెలంగాణ

telangana

Google pay: ఫోన్‌ పోతే.. జీ పే అకౌంట్​ను బ్లాక్​ చేయండిలా!

By

Published : Nov 24, 2021, 10:39 AM IST

google pay account
గూగుల్​ పే అకౌంట్​ ()

ఆండ్రాయిడ్‌ స్మార్ట్‌ఫోన్‌లో గూగుల్​ పే వాడుతున్నారా? మరి ఫోన్​ పోతే? గూగుల్​ పే అకౌంట్​ను బ్లాక్‌(block google pay account) చేయవచ్చా? అయితే ఎలా చేయాలి?

ఇప్పుడు చాలామంది స్మార్ట్‌ఫోన్‌లో పేమెంట్‌ యాప్‌ల ద్వారానే నగదు లావాదేవీలు నిర్వహిస్తున్నారు. డబ్బులు పంపించటానికి, తీసుకోవటానికి వీటినే వాడుతున్నారు. మరి ఫోన్‌ పోతే ఎలా? పాస్‌వర్డ్‌ లేదా పిన్‌తో భద్రంగా ఉండేలా చూసుకున్నా మన వివరాలు ఎవరైనా చూస్తారేమో, పేమెంట్‌ యాప్‌ల ద్వారా డబ్బులు తస్కరిస్తారేమోననే భయం వెంటాడుతూనే ఉంటుంది. కాబట్టి వీటిని ఉపయోగించకుండా తగు చర్యలు తీసుకోవటం తప్పనిసరి.

ఫోన్‌ పోయినప్పుడు వేరే పరికరం నుంచి డిజిటల్‌ పేమెంట్‌ అకౌంట్లను బ్లాక్‌(block google pay account) చేసుకోవచ్చు. తొలగించుకోవచ్చు. ఆండ్రాయిడ్‌ పరికరాల్లో గూగుల్‌ పే వాడేవారికిది చాలా తేలికనే అనుకోవచ్చు. వేరే ఆండ్రాయిడ్‌ పరికరం ద్వారా మొత్తం డేటాను నిర్మూలించుకోవచ్చు మరి. ఫోన్‌ పోయినప్పుడు తమ సమాచారం గురించి దిగులు చెందేవారికిది మంచి సదుపాయమనే చెప్పుకోవాలి.

బ్లాక్​ చేయండిలా!

ముందుగా android.com/find వెబ్‌సైట్‌ను తెరవాలి. గూగుల్‌ అకౌంట్‌తో లాగిన్‌ అవ్వాలి. అప్పుడు ఎడమ వైపున గూగుల్‌ అకౌంట్‌తో అనుసంధానమైన పరికరాల వివరాలు కనిపిస్తాయి. ఇందులో ఎరేజ్‌ డేటా ఫీచర్‌ను ఎంచుకుంటే ఫోన్‌లో ఉన్న డేటా అంతా తొలగిపోతుంది. ఇది వద్దనుకుంటే కస్టమర్‌ కేర్‌ ద్వారానూ గూగుల్‌ ఖాతాను బ్లాక్‌(block google pay on lost phone) చేసుకోవచ్చు.

ముందుగా 18004190157 నంబరుకు ఫోన్‌ చేసి 'అదర్‌ ఇష్యూస్‌'ను ఎంచుకోవాలి. తర్వాత స్పెషలిస్టుతో మాట్లాడే ఆప్షన్‌ను ఎంచుకొని, వారి సాయంతో గూగుల్‌ ఖాతాను బ్లాక్‌ చేసుకోవచ్చు. ఇందుకోసం గూగుల్‌ ఖాతాతో ముడిపడిన మొబైల్‌ నంబరును ధ్రువీకరించుకోవాల్సి ఉంటుంది.

ఇదీ చూడండి:ఆండ్రాయిడ్ ఫోన్‌ వాడుతున్నారా.. మరి ఈ మార్పులు చేశారా?

ABOUT THE AUTHOR

...view details