తెలంగాణ

telangana

chrome browser: గూగుల్​ క్రోమ్​లో అదిరిపోయే థీమ్స్​!

By

Published : Sep 22, 2021, 10:18 AM IST

Google Chrome themes

మనలో కొత్తదనాన్ని కోరుకునే వారు చాలా మంది ఉంటారు. మన ఉపయోగించే వస్తువులు కూడా కొంచెం నూతనంగా ఉండాలని భావిస్తాం. అలాంటిది మనం రోజూ వాడే గూగుల్​ క్రోమ్​ను ఎప్పడూ ఒకేలా చూస్తే ఏం బాగుంటుంది? అందుకే.. మనకు నచ్చిన, అందుబాటులో ఉండే థీమ్​ను గూగుల్​ క్రోమ్​లో సెట్​ చేసుకుందాం. ఎలా చేయాలో ఓ లుక్కేద్దామా?

ఎక్కువమంది ఇష్టపడేది గూగుల్‌ క్రోమ్‌ బ్రౌజరే. ఉద్యోగుల దగ్గర్నుంచి విద్యార్థుల వరకూ అంతా దీన్ని వాడేవారే. గంటలకొద్దీ దీనిపై రకరకాల పనులు చేసేవారే. మరి క్రోమ్‌ ఎప్పుడూ ఒకేలా కనిపిస్తే ఏం బాగుంటుంది? అప్పుడప్పుడూ కొత్తందాలను జోడించుకుంటే విసుగు పుట్టకుండా చూసుకోవచ్చు. ఇందుకు ఉపయోగపడేవే తెర నేపథ్యాలు (థీమ్స్‌). జంతువులు, పర్వతాలు, మైదానాలు, కళలు, రంగుల వంటి వాటితో ఇవి బ్రౌజర్‌ కనిపించే తీరునే మార్చేస్తాయి. క్రోమ్‌ స్టోర్‌ ఎక్స్‌టెన్షన్‌ నుంచి వీటిని బ్రౌజర్‌కు జోడించుకోవచ్చు. నిజానికి చాలామంది వీటిని ఇప్పటికే ఉపయోగిస్తుండొచ్చు కూడా. అయినా మరోసారి మననం చేసుకుంటే కొత్తవారికి తెలియజేసినట్టూ అవుతుంది.

ఫ్లయింగ్‌ పెయింట్‌

దట్టమైన రంగులు లయబద్ధంగా గాల్లో తేలుతుంటే ఎలా ఉంటుంది? ఫ్లయింగ్‌ పెయింట్‌ థీమ్‌లా ఉంటుంది. ఇది బ్రౌజర్‌ మరింత కొత్తగా, కళకళలాడేలా చేస్తుంది. చూస్తున్నకొద్దీ హుషారును కలిగిస్తుంది.

ఫ్లయింగ్‌ పెయింట్‌

మెటీరియల్‌ డార్క్‌

అన్నిరకాల యాప్స్‌ను డార్క్‌ మోడ్‌లో వాడుకోవాలని భావించే వారికిది మంచి థీమ్‌. క్రోమ్‌ స్టోర్‌లో అందుబాటులో ఉండే నలుపు నేపథ్యాల్లో మెటీరియల్‌ డార్క్‌ ఒకటి. లక్షలాది మందికి ఇష్టమైనదిది. ముఖ్యంగా ఎక్కువ గంటలు బ్రౌజర్‌ మీద పనిచేసేవారికి ఎంతగానో ఉపయోగపడుతుంది.

మెటీరియల్‌ డార్క్‌

బ్లూ/గ్రీన్‌ క్యూబ్స్‌

నీలం, ఆకుపచ్చ రంగుల కలయికలతో కూడిన క్యూబ్స్‌తో కనువిందు చేయటం దీని ప్రత్యేకత. ఇది క్రోమ్‌ బ్రౌజర్‌ను మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దుతుందనటంలో ఎలాంటి సందేహం లేదు. పెద్దగా హంగూ ఆర్బాటాలేవీ లేకపోయినా బ్రౌజర్‌ అందాన్ని రెట్టింపు చేస్తుంది.

బ్లూ/గ్రీన్‌ క్యూబ్స్‌

ల్యాండ్‌స్కేప్‌ థీమ్‌

అందమైన ప్రకృతి దృశ్యాలను ఇష్టపడనివారెవరు? అందుకేనేమో ల్యాండ్‌స్కేప్‌ థీమ్‌ను చాలామంది ఇష్టపడతారు. అడవులు, పర్వతాలు, జంతువులు, మైదానాలు, ఎడారులతో కూడిన ఎన్నో సహజ సుందర దృశ్యాలతో ఇట్టే ఆకట్టుకుంటుంది. చూడగానే మనసు తేలికపడేలా చేస్తుంది.

ల్యాండ్‌స్కేప్‌ థీమ్‌

స్పేస్‌ థీమ్‌

దీన్ని డార్క్‌ మోడ్‌ థీమ్‌కు కొనసాగింపు అనుకోవచ్చు. ఖగోళ చిత్రాలతో ఎవరినైనా కట్టి పడేస్తుంది. కంప్యూటర్‌ నుంచే అంతరిక్షాన్ని, మినుకు మినుకు నక్షత్రాలను వీక్షిస్తున్న అనుభూతి కలిగిస్తుంది. కళ్లు అలసిపోకుండా చూస్తుంది.

స్పేస్‌ థీమ్‌

ఇదీ చూడండి:Whatsapp App: మీ వాట్సాప్ ఇకపై ఒకేసారి నాలుగు డివైజ్​ల్లో..

ABOUT THE AUTHOR

...view details