తెలంగాణ

telangana

Universal Vaccine: అన్ని వేరియంట్లనూ ఎదుర్కొనే సార్వత్రిక టీకా

By

Published : Jan 11, 2022, 6:47 AM IST

corona vaccine
కరోనా టీకా ()

Universal Vaccine: కరోనా వైరస్‌ మహమ్మారి ధాటికి వణికిపోతోన్న ప్రపంచ దేశాలు.. కొవిడ్‌-19ని ఎదుర్కొనే వ్యాక్సిన్‌ను కనుగొన్నాయి. అయినప్పటికీ రానున్న రోజుల్లో సంభవించే మహమ్మారులపై మాత్రం ఆందోళన చెందుతూనే ఉన్నాయి. అయితే.. సాధారణ జలుబు కలిగించే కొన్ని రకాల కరోనా బారినపడిన వారికి ప్రస్తుతం మెరుగైన రక్షణ లభిస్తుందని తేలింది. గతంలో అధిక స్థాయిలో వెలువడిన టీ కణాల పాత్రను నిర్ధరించామని, రెండో తరం సార్వత్రిక టీకాల తయారీకి ఈ పరిశోధన దోహదపడుతుందని వివరించారు.

Universal Vaccine: సాధారణ జలుబు కలిగించే కొన్ని రకాల కరోనా వైరస్‌ల బారినపడిన వారికి ప్రస్తుతం కొవిడ్‌ కారక సార్స్‌-కోవ్‌-2 నుంచి మెరుగైన రక్షణ లభిస్తుందని వెల్లడైంది. గతంలో అధిక స్థాయిలో వెలువడిన టి కణాల వల్ల ఇలాంటివారు ప్రస్తుతం కొవిడ్‌-19 బారినపడే అవకాశం తక్కువని లండన్‌లోని ఇంపీరియల్‌ కాలేజ్‌ శాస్త్రవేత్తలు తేల్చారు. ఈ బృందానికి భారత సంతతి పరిశోధకుడు అజిత్‌ లాల్‌వాని నేతృత్వం వహించారు. కొవిడ్‌ నుంచి రక్షించడంలో టి కణాల పాత్రను నిర్ధరించే మొదటి ఆధారాన్ని ఈ పరిశోధన ద్వారా అందించామని ఆయన తెలిపారు. ఒమిక్రాన్‌ సహా ప్రస్తుత, భవిష్యత్‌ కరోనా వేరియంట్ల నుంచి రక్షణ కల్పించే రెండో తరం సార్వత్రిక టీకాల తయారీకి ఈ పరిశోధన దోహదపడుతుందని వివరించారు.

" వ్యాక్సినేషన్‌ కారణంగా ప్రజల్లో ఉత్పత్తవుతున్న యాంటీబాడీల వల్ల స్పైక్‌ ప్రొటీన్‌పై తీవ్ర ఒత్తిడి పడుతోంది. టీకాలను ఏమార్చే ఉత్పరివర్తనాల పుట్టుకకు అది దారితీస్తోంది. దీనికి భిన్నంగా కరోనాలోని అంతర్గత ప్రొటీన్లు చాలా తక్కువగా ఉత్పరివర్తన చెందుతాయి. టి కణాలు వీటినే లక్ష్యంగా చేసుకుంటాయి. వీటివల్ల కరోనాలోని అన్ని వేరియంట్ల నుంచీ మెరుగైన రక్షణ పొందొచ్చు"

- అజిత్‌ లాల్​వాని, భారత సంతతి పరిశోధకుడు

ఇతర కరోనా వైరస్‌ల వల్ల వెలువడిన టి కణాలు సార్స్‌-కోవ్‌-2 వైరస్‌ను పసిగట్టగలవని ఇప్పటికే పలు పరిశోధనల్లో తేలింది. తాజా అధ్యయనంలో.. కొవిడ్‌ కారక వైరస్‌ సోకినప్పుడు ఈ టి కణాలు ఎలా స్పందిస్తాయన్నది శాస్త్రవేత్తలు శోధించారు. వైరస్‌ ఉపరితలంపై ఉండే స్పైక్‌ ప్రొటీన్‌ను కాకుండా వాటి లోపల ఉండే ఇతర ప్రొటీన్లపై దాడి చేయడం ద్వారా ఈ కణాలు రక్షణ కల్పిస్తాయని వెల్లడైంది.

ఇదీ చూడండి:Universal Vaccine: అన్ని వైరస్‌లపై..ఒకే ఆయుధం!

ABOUT THE AUTHOR

...view details