తెలంగాణ

telangana

News in Images: కాలిఫోర్నియాలో భయానక దృశ్యాలు

By

Published : Aug 5, 2021, 4:18 PM IST

CALIFORNIA WILDFIRES

కాలిఫోర్నియాను కార్చిచ్చు కమ్మేసింది. అనేక ఇళ్లు మంటలకు కాలిపోయాయి. వాతావరణం పొడిగా ఉన్నందున మంటలు మరింతగా వ్యాపించే ప్రమాదం ఉంది.

అమెరికా కాలిఫోర్నియాలో కార్చిచ్చు అంతకంతకూ వ్యాపిస్తోంది. మూడు వారాలుగా విస్తరిస్తున్న దావానలం బుధవారం ఒక్కసారిగా విజృంభించింది. అడవులు, కొండలను దహించివేస్తోంది. మారుమూల గ్రామాల్లోని అనేక ఇళ్లు అగ్నికి ఆహుతయ్యాయి.

గ్రీన్​విల్లే ప్రాంతంలోని 89వ నెంబర్ రహదారిపై ఉన్న ఓ ఇంటిని పూర్తిగా కమ్మేసిన దావానలం.. మంటల్లో కాలిపోతున్న వాహనాలు.

వాతావరణం పొడిగా ఉన్నందు వల్ల మంటలు మరింత వేగంగా వ్యాపించే ప్రమాదం ఉందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పరిసర ప్రాంతాల్లో ఉంటున్న వారిని ఖాళీ చేయించారు. ప్లుమాస్, బుట్టే కౌంటీలలో ఇప్పటికే వెయ్యి చదరపు కిలోమీటర్లకు పైగా భూభాగంలో కార్చిచ్చు బీభత్సం సృష్టించింది. ఇందుకు సంబంధించిన చిత్రాలు అత్యంత భీతిగొలిపేలా ఉన్నాయి.

మంటల్లోనే ఇల్లు
మంటల ధాటికి మోడువారిన చెట్టు.. పరిసరాల్లో కార్చిచ్చు..
రహదారి పక్కన ఉన్న చెట్లను మింగేస్తున్న దావానలం
సెంట్రల్ గ్రీన్​విల్లేలోని ఓ స్ట్రీట్ బోర్డు
ప్లుమాస్ కౌంటీ గ్రీన్​విల్లేలో మంటలకు కాలిపోతున్న చెట్లు.
అటవీ ప్రాంతంలో ప్రమాదకరంగా వ్యాపిస్తున్న మంటలు
ప్లుమాస్ కౌంటీలో మంటలకు పూర్తిగా కాలిపోయిన ఇళ్లు.
మంటల ధాటికి విద్యుత్ స్తంభం పరిస్థితి ఇదీ...
మంటలకు పూర్తిగా దగ్ధమైన చారిత్రక సియెర్రా లాడ్జి
ఆకాశాన్ని ఆవహించిన దట్టమైన పొగ

ABOUT THE AUTHOR

...view details