బుల్లితెరపై మాస్ సంగమం సాక్షాత్కారమైంది. నటసింహ బాలకృష్ణ వ్యాఖ్యతగా వ్యవహరిస్తున్న అన్‌స్టాపబుల్ 2 షోకు పవర్ స్టార్ పవన్ కల్యాణ్ గెస్ట్‌గా వచ్చారు. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఈ ఎపిసోడ్ ప్రోమో శుక్రవారం విడుదలయ్యింది. కాగా, ఇందులో బాలకృష్ణ చాలా ఆసక్తికరమైన ప్రశ్నలు అడిగారు. దీనికి అంతే జోష్‌తో పపర్ స్టార్ సమాధానాలిచ్చారు.
పీఎస్పీకేxఎన్బీకే కలిసి కనిపించడం చాలా అరుదు. ఈ షోకు పవన్ కల్యాణ్‌కు గ్రాండ్ వెల్కమ్ ఇచ్చారు బాలకృష్ణ. మొదట నటసింహ తనను 'బాల' అని పిలవమని పవన్‌తో అన్నారు. దీనికి పవన్ కల్యాణ్ 'ఓడిపోవడానికి కూడా సిద్ధం' అంటూ నవ్వులు పూయించారు. అనంతరం బాలకృష్ణ ' ఈ మధ్య నీ విమర్శల్లో వాడి వేడి డబుల్ ఇంపాక్ట్ అయ్యింది' అని అడిగారు. పవన్ నవ్వుతూ ' నేను చాలా పద్ధతిగా మట్లాడతానండీ' వ్యంగంగా అన్నారు. అనంతరం మీ అన్నయ్య చిరంజీవి వద్ద నుంచి నేర్చుకున్నదేంటి, వద్దనుకున్నదేంటి అనే ఆసక్తికరమైన ప్రశ్న అడిగారు. దీనికి పవర్ స్టార్ ఓరోజు వదినకు ఫోన్ చేసి ఇదే నా లాస్ట్ సినిమా, ఇంక నా వల్ల కాదు' అని చెప్పినట్లు సమాధానమిచ్చారు. దీనికి ఈ పాలిటిక్స్ నా దగ్గర వద్దు అని బాలకృష్ణ అన్నారు. 'రాష్ట్రంలో మీకు ఫ్యాన్ కాని వాడు లేడు, ఆ అభిమానం ఓట్లుగా కన్వర్ట్ ఎందుకు కాలేదు' అని అడిగారు బాలకృష్ణ.