తెలంగాణ

telangana

ఛాన్స్​ దొరికితే ఈ సారి తారక్​, చరణ్​ను ఓ ఆటాడుకుంటా!: రాజమౌళి

By

Published : Jan 25, 2023, 10:25 AM IST

Updated : Jan 25, 2023, 10:38 AM IST

rajamouli tweeted on twitter to congragulate the team

'ఆర్​ఆర్​ఆర్'లోని నాటు నాటు సాంగ్​ ఆస్కార్​ నామినేషన్స్​ దక్కించుకోవడంపై హర్షం వ్యక్తం చేశారు దర్శకధీరుడు రాజమౌళి. ఈ పాట కోసం కష్టపడిన ప్రతిఒక్కరికీ, అభిమానులకు ధన్యవాదాలు తెలిపారు. అలాగే తారక్​, చరణ్​పై కొన్ని కామెంట్స్ చేశారు.

దిగ్గజ దర్శకుడు రాజమౌళి సృష్టించిన అద్భత చిత్రం 'ఆర్​ఆర్​ఆర్'. ఈ సినిమా బాక్సాఫీస్​ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టించింది. అందరి నోట ఔరా అనిపించిన ఈ చిత్రం ప్రతిష్ఠాత్మక ఆస్కారు అవార్డు నామినేషన్స్​లో చోటు దక్కించుకుంది. ఒరిజినల్ సాంగ్ కేటగిరిలో 'నాటు నాటు ' పాట ఆస్కార్ నామినేషన్లలో నిలిచింది. దీంతో సామాన్యుల నుంచి ఇండియా వైడ్ సెలబ్రిటీలంతా ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఈ క్రమంలోనే నాటు నాటు ఆస్కార్​కు ఎంపిక అవ్వడంపై జక్కన్న హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ పాట ఇంత ప్రతిష్ఠను సంపాదించడానికి కారణమైన వారినందరినీ ట్విట్టర్ వేదికగా కృతజ్ఞతలు తెలిపారు.

"నా సినిమాలో నా పెద్దన్న పాటకు ఆస్కార్ నామినేషన్ వచ్చింది. నేను ఇంతకంటే ఎక్కువగా అడగలేను. ప్రస్తుతం తారక్, చరణ్‌ల కన్నా నేనే నాటు నాటు పాటకు చాలా ఉత్సాహంగా డ్యాన్స్ చేస్తున్నాను’ అన్నారు. చంద్రబోస్ గారూ కంగ్రాచ్యులేషన్స్... ఆస్కార్ వేదిక మీద మన పాట వినిపిస్తోంది. ప్రేమ్ రక్షిత్ మాస్టర్.. ఈ పాట కోసం మీ కృషి అమూల్యం. నా వ్యక్తిగత ఆస్కార్ మీకే. నాటు నాటు పాట విషయంలో చాలా కాలం పాటు సందిగ్ధంలో ఉన్న నాకు భైరవ బీజీఎం ఎంతో భరోసా అందించింది. ఈ పాటను మరింత ముందుకు తీసుకెళ్లేలా చేసింది. థాంక్యూ భైరీ బాబు. రాహుల్ సిప్లిగంజ్​ భైరవ అద్భుతంగా పాడారు. ఇక ఈ పాట ఈ స్థాయికి రావడానికి ప్రధాన కారణాలు ఎన్టీఆర్, రామ్ చరణ్ మధ్య సమన్వయం, స్టైయిల్. తమదైన శైలిలో వారు చేసిన డ్యాన్స్ ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల హృదయాలను తాకింది. కానీ టార్చర్​ పెట్టినందుకు సారీ. ఛాన్స్ దొరికితే వాళ్లిద్దరినీ మరోసారి ఇలా ఆడుకోవడానికి నేను వెనుకాడనండోయ్! అసలు నేనెప్పుడూ ఆస్కార్ వరకు వెళతానని ఊహించలేదు. ఇదంతా నాటు నాటు పాటకు, ఆర్ఆర్ఆర్​కు ఉన్న అభిమానుల వల్లే సాధ్యమైంది. వారి అభిమానం చూసిన తర్వాత ఈ పాటను ముందుకు తీసుకెళ్లాలన్న ఆలోచన మా మనసుల్లో కలిగింది. వీరాభిమానులందరికీ ఈ సందర్భంగా కృతజ్ఞతలు.

అసలు నేనెప్పుడూ ఆస్కార్ వరకు వెళతానని ఊహించలేదు. ఇదంతా నాటు నాటు పాటకు, ఆర్ఆర్ఆర్​కు ఉన్న అభిమానుల వల్లే సాధ్యమైంది. వారి అభిమానం చూసిన తర్వాత ఈ పాటను ముందుకు తీసుకెళ్లాలన్న ఆలోచన మా మనసుల్లో కలిగింది. వీరాభిమానులందరికీ ఈ సందర్భంగా కృతజ్ఞతలు. ఇక కార్తికేయ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. అలుపెరగకుండా అతడు పనిచేయడం వల్లే ఈ ఘనత సాధ్యమైంది. నీ పట్ల గర్విస్తున్నాను. ఇంకా ఈ పాటకు 24 గంటల పాటు ప్రచారం చేయడంలో కృషి చేసిన ప్రదీప్, హర్ష, చైతన్యలకు కృతజ్ఞతలు. ఆస్కార్​కు మరొక్క అడుగుదూరంలో ఉన్నాం... థాంక్యూ" అంటూ రాజమౌళి పేర్కొన్నారు." అని అన్నారు.

ట్విట్టర్ వేదికగా చిత్రబృందంపై రాజమౌళి ప్రశంసల వర్షం
Last Updated :Jan 25, 2023, 10:38 AM IST

ABOUT THE AUTHOR

...view details