తెలంగాణ

telangana

పిల్లల ముందు పాడు పని.. ప్రముఖ నటుడు అరెస్టు

By

Published : Jul 7, 2022, 1:04 PM IST

malayalama actor arrested

Actor Arrested: విలన్​గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్​గా విభిన్నమైన పాత్రలతో మంచి గుర్తింపు సంపాదించుకున్న ప్రముఖ మలయాళ నటుడు శ్రీజిత్​ రవిని పోలీసులు అరెస్ట్​ చేశారు. బాలికలతో అసభ్యంగా ప్రవర్తించిన కేసులో ఆయన్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Malayalam Actor Arrested: బాలికలతో అసభ్యంగా ప్రవర్తించారనే ఆరోపణలతో ప్రముఖ మలయాళ నటుడు శ్రీజిత్ రవిని పోలీసులు అరెస్ట్ చేశారు. పోక్సో చట్టం కింద ఆయనపై పోలీసులు కేసు నమోదు చేశారు.
బాలికలతో అభ్యంతరకర రీతిలో శ్రీజిత్ ప్రవర్తించారన్నది ప్రధాన ఆరోపణ. ఇద్దరు అమ్మాయిలు రోడ్డుపై నడుచుకుంటూ వెళుతున్న సమయంలో ఆయన నగ్నంగా తన కారులో నుంచి దిగి వారిని ఇబ్బందికి గురి​ చేసినట్లు తెలిసింది. లైంగిక వేధింపుల కేసులో శ్రీజిత్ రవి అరెస్ట్ కావడం ఇది రెండోసారి.

మలయాళ నటుడు శ్రీజిత్​ రవి

గతంలో ఇదే రీతిలో పాఠశాల విద్యార్థులతో అసభ్యకరంగా ప్రవర్తించిన కేసులో శ్రీజిత్ రవిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ కేసులో చాలా రోజుల పాటు జైలులో ఉన్న ఆయన ఆ తర్వాత బెయిల్​పై విడుదలయ్యారు. పోలీసులు కావాలనే ఆ కేసును తప్పుదోవ పట్టించారనే ఆరోపణలు కూడా వచ్చాయి. తాజాగా మరోసారి ఆయనపై కేసు నమోదు కావడం మలయాళ చిత్ర పరిశ్రమలో హాట్​టాపిక్​గా మారింది.

మలయాళ సీనియర్ నటుడు టీజీ రవి తనయుడిగా సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు శ్రీజిత్ రవి. 2005లో 'మయూఖం' సినిమాతో నటుడిగా అరంగేట్రం చేశారు. విలన్​గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్​గా విభిన్నమైన పాత్రలతో మంచి గుర్తింపు సొంతం చేసుకున్నారు. ఇటీవల విడుదలైన 'జో అండ్ జో' సినిమాలో పోలీస్ ఆఫీసర్​గా నటించారు.

ఇవీ చదవండి:అందుకే 9 ఏళ్లు సినిమాలకు దూరంగా ఉన్నా: నటుడు వేణు

ఓటీటీలో అనుపమ 'బటర్​ప్లై' రిలీజ్!​.. కమల్​ 'ఇండియన్​ 2' నుంచి కాజల్​ ఔట్​?

ABOUT THE AUTHOR

...view details