Koffee With Karan Show 7th Season: బాలీవుడ్ ప్రముఖ నిర్మాత కరణ్ జోహార్ వ్యాఖ్యాతగా ప్రేక్షకాదరణ పొందిన సెలబ్రిటీ చాట్ షో 'కాఫీ విత్ కరణ్'. ఆరు సీజన్లపాటు సాగిన ఈ షో.. ఏడో సీజన్ డిస్నీ ప్లస్ హాట్స్టార్ వేదికగా ప్రేక్షకులను అలరించనుంది. అందుకు సంబంధించిన వివరాలను కరణ్ జోహర్ ఆదివారం వెల్లడించారు. జులై 7 నుంచి డిస్నీ ప్లస్ హాట్స్టార్లో ప్రసారం కానుందంటూ ఓ వీడియో ట్వీట్ చేశారు.
అయితే స్టార్ హీరోయిన్ సమంత సీజన్ 7తో.. ఈ షోలోకి అరంగేట్రం చేయనున్నారని సమాచారం. అందుకు సంబంధించి షూటింగ్ కూడా పూర్తైనట్లు తెలుస్తోంది. సమంత ఇటీవలే తన ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసిన ఫొటోలే ఈ ఊహాగానాలకు తెరలేపాయి. ఆ ఫొటోల్లోని బ్యాక్గ్రౌండ్, కరణ్ ఇటీవలే పోస్ట్ చేసిన ఫొటోల్లోని బ్యాక్గ్రౌండ్ ఒకేలా ఉండటం ఈ ఊహాగానాలకు బలాన్నిచ్చింది. మరి చూడాలి ఏం జరుగుతుందో!