తెలంగాణ

telangana

Balaji nagar theft case : ఈజీ మనీ కోసం చోరీ.. రెండు గంటల్లోనే చిక్కారు!

By

Published : Dec 28, 2021, 12:17 PM IST

Balaji nagar theft case, medchal theft case
బాలాజీ నగర్ చోరీ కేసు ()

Balaji nagar theft case : దినసరి కూలీలుగా పనిచేసే ఆ ఇద్దరు ఈజీ మనీ కోసం దొంగతనం ఒక్కటే మార్గమనుకున్నారు. తాళం వేసి ఉన్న ఇంటినే టార్గెట్​ చేసుకున్నారు. ఇక పక్కా ప్లాన్​తో ఆ ఇంట్లోకి ప్రవేశించి బంగారు నగలు, నగదు ఎత్తుకెళ్లారు. చివరకు గంటల వ్యవధిలోనే పోలీసులకు చిక్కారు.

Balaji nagar theft case : సులభంగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో దొంగతనం చేశారు ఓ ఇద్దరు. ఇంట్లో ఎవరూలేని సమయంలో చొరబడి బంగారం, నగదు కాజేశారు. అంతే రెండు గంటల్లోనే పోలీసులకు చిక్కారు.

తాళాలు పగలగొట్టి చోరీ

ఏం జరిగింది?

మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా ఘట్ కేసర్ బాలాజీనగర్​లో విజయలక్ష్మి వస్త్ర దుకాణం యాజమాని లింగం నివసిస్తున్నారు. వారి ఇంటికి బంధువులు వచ్చారు. సోమవారం రాత్రి ఇంటికి తాళం వేసి కుటుంబ సభ్యులు, బంధువులు సినిమా చూడటం కోసం నారపల్లికి వెళ్లారు. సినిమా అయ్యాక ఇంటికి వచ్చేసరికి... అనుమానాస్పదంగా ఉన్న ఇద్దరు వ్యక్తులు వీరిని చూసి పారిపోయారు. తీరా ఇంట్లోకి వెళ్లి చూస్తే.. తాళం పగలగొట్టి ఉంది. బీరువాలో ఉన్న 28 తులాల బంగారు నగలు కనిపించలేదు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని... స్థానిక పరిసరాలను పరిశీలించి... సీసీ కెమెరాలను డేటాను సేకరించారు.

నగలు, నగదు మాయం

ఇలా దొరికారు..

ఇంటి సమీపంలో ఉండే మహమ్మద్ నవీద్, వెంకటరమణలు చోరీ చేసినట్లు పోలీసులు గుర్తించారు. కేవలం రెండు గంటల్లోనే గుర్తించి... ఇద్దరినీ అదుపులోకి తీసుకున్నారు. నిందితులను పోలీసు స్టేషన్​కు తరలించి విచారణ జరిపారు. దొంగతనం చేసినట్టు వాళ్లు ఒప్పుకున్నారని పోలీసులు తెలిపారు. చోరీకి గురైన బంగారు నగలను స్వాధీనం చేసుకున్నామని వెల్లడించారు. నిందితులు దినసరి కూలీలుగా పని చేస్తున్నారని... వారికి వచ్చే సంపాదన సరిపోకపోవడంతో చోరీకి పాల్పడినట్లు పోలీసులు వివరించారు.

ఇదీ చదవండి:Godavarikhani Accident Today: బర్త్​డే పార్టీకి వెళ్లి తిరిగొస్తుండగా ప్రమాదం.. ఇద్దరు యువకులు మృతి

ABOUT THE AUTHOR

...view details