తెలంగాణ

telangana

child death with vaccine: ఒకేసారి ఐదు టీకాలు.. మూణ్నెళ్ల చిన్నారి మృతి

By

Published : Nov 24, 2021, 6:56 PM IST

three month child died after giving vaccine

టీకా వికటించి మూడు నెలల చిన్నారి మృతి(child died with vaccine) చెందిన ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం సారపాకలో చోటుచేసుకుంది. ప్రభుత్వం చిన్న పిల్లలకు వేసే టీకాలో భాగంగా ఈరోజు సారపాక పీహెచ్​సీలో టీకాలు వేయించారు. కళ్లముందే పాప మృతి చెందడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

టీకా వికటించి మూడు నెలల చిన్నారి మృతి(child died with vaccine) చెందిన ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం సారపాకలో చోటుచేసుకుంది. ప్రభుత్వం చిన్న పిల్లలకు వేసే టీకాలో భాగంగా ఈరోజు సారపాక పీహెచ్​సీలో టీకాలు వేయించారు. ఇంటికి తీసుకు వెళ్లే క్రమంలో పాప మృతి చెందిందని తల్లిదండ్రులు చెబుతున్నారు. కళ్లముందే పసిపాప మృతి చెందడంతో తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు.

సిబ్బంది నిర్లక్ష్యమే కారణం

ఆస్పత్రి సిబ్బంది నిర్లక్ష్యంతో తమ పాప చనిపోయిందంటూ బాధిత కుటుంబసభ్యులు ఆందోళనకు దిగారు. గ్రామానికి చెందిన సందీప్, నాగమణిలకు రెండో సంతానంగా బాలిక జన్మించింది. మూడ్నెళ్ల చిన్నారికి పీహెచ్​సీలో(child vaccine at sarapaka phc) టీకా వేసేందుకు తీసుకువెళ్లారు. వ్యాక్సిన్‌ వేయించి... ఇంటికి తీసుకువెళ్తుండగానే పాప అస్వస్థతకు గురవటంతో... తల్లి ఆందోళనకు గురైంది. కాసేపట్లోనే చిన్నారి చనిపోవటంతో.... తల్లిదండ్రులు గుండెలు బాదుకున్నారు. ఆస్పత్రి సిబ్బంది ఒకే సారి ఐదు టీకాలు(vaccine effect on child) ఇచ్చినందునే తమ బిడ్డ చనిపోయిందని చిన్నారి తండ్రి ఆరోపిస్తున్నాడు.

అందరి పిల్లలాగే టీకాలు ఇచ్చాం

అందరి పిల్లలకు ఇచ్చే మాదిరిగానే ఈ పాపకు కూడా టీకాలు ఇచ్చామని ఆస్పత్రి సిబ్బంది తెలిపారు. ఎలా జరిగిందో తెలియడం లేదని టీకాలు వేసిన సిబ్బంది వెల్లడించారు.

టీకా వికటించి మూడు నెలల చిన్నారి మృతి

'వ్యాక్సిన్ కోసం పాపను తీసుకొస్తే ఒకేసారి ఐదు వ్యాక్సిన్లు వేశారు. దీంతో పాప సృహ తప్పిపోయింది. వాళ్లే ప్రైవేట్​కు తీసుకెళ్లమని చెప్పారు. ప్రైవేట్​కు వెళ్తే వాళ్లు మాత్రం గవర్నమెంట్​కే తీసుకెళ్లమని చెప్పారు. మళ్లీ ఇక్కడికి వచ్చి అడిగితే అందరికీ వేసినాం కదా.. వాళ్లకేం కాలే కదా అన్నారు. మా పాప యాక్టివ్​గానే ఉంది కదా అని అడిగితే అవును అని చెప్పారు. మళ్లీ ఇలా ఎందుకు జరిగింది అని అడిగితే రెస్పాన్స్ లేదు.'

- చిన్నారి తండ్రి

ఇదీ చూడండి:

Student suicide: తల్లిదండ్రులు నచ్చిన దారిలో వెళ్లనివ్వలేదు.. శాశ్వతంగా వెళ్లిపోయాడు!

ABOUT THE AUTHOR

...view details