తెలంగాణ

telangana

యువకుడిని చెట్టుకు కట్టి కొట్టిన గ్రామస్థులు.. ఆ పని చేశాడని..

By

Published : Sep 7, 2022, 1:02 PM IST

యువకుడుపై గ్రామస్థులు ఫైర్

virla video ఓ యువకుడిని అక్కడి గ్రామస్థులు చెట్టుకు కట్టేసి చితకబాదారు. ఇప్పుడు ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. అసలు ఆ యువకుడిని గ్రామస్థులు ఎందుకు కొట్టారు. అంతలా అతను చేసిన తప్పు ఏమిటి?

virla video భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఓ మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని ఓ యువకుడిని చెట్టుకు కట్టేసి కొట్టారు. ఇప్పుడు ఆ వీడియో సామాజిక మధ్యమాల్లో వైరల్​ అవుతోంది. జిల్లాలోని టేకులపల్లి మండంలం గంగారం గ్రామ పరిధిలోని సంపత్​ నగర్​కు చెందిన ఓ యువకుడు(23) అదే గ్రామానికి చెందిన ఓ మహిళ(30)తో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు.

ఈ విషయం తెలుసుకున్న గ్రామస్థులు.. గ్రామశివారులోని మామిడి తోటలో చెట్టుకు కట్టి చితక బాదారు. ఈ ఘటన తర్వాత బాధితుడు గ్రామాన్ని విడిచి వెళ్లినట్లు అక్కడి గ్రామస్థులు తెలిపారు. అయితే ఈ వీడియో ఇప్పుడు సామాజిక మధ్యామాల్లో చక్కర్లు కొడుతోంది.

యువకుడుపై గ్రామస్థులు ఫైర్

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details