తెలంగాణ

telangana

Ganja Crop Destroyed: విశాఖ ఏజెన్సీలో 425 ఎకరాల్లో గంజాయి పంట ధ్వంసం

By

Published : Nov 4, 2021, 11:23 AM IST

police

ఏపీ విశాఖ జిల్లా ఏజెన్సీలో గంజాయి పంటను పోలీసులు, ఎస్‌ఈబీ అధికారులు ధ్వంసం (Ganja Crop Destroyed) చేశారు. బోయితిలి గ్రామంలో 45 ఎకరాలు, రాచవీది గ్రామంలో 40 ఎకరాలు, జి.కె.వీధి మండలం రొంపుల గ్రామంలో 60 ఎకరాలు, తూర్పు గోదావరి జిల్లా మోతుగుడెం మండలంలో ఒడియా క్యాంప్ వద్ద 10 ఎకరాలలో పండిస్తున్న గంజాయి పంటను ధ్వంసం చేశారు.

విశాఖ ఏజెన్సీలో గంజాయి పంట ధ్వంసం

ఆంధ్రప్రదేశ్​ విశాఖ జిల్లా ఏజెన్సీలోని జి.మాడుగుల మండలం బోయితిలి గ్రామంలో గంజాయి పంటను (Ganja Crop Destroyed) పోలీసులు, ఎస్‌ఈబీ అధికారులు ధ్వంసం చేశారు. బోయితిలి గ్రామంలో 45 ఎకరాలు, రాచవీది గ్రామం లో 40 ఎకరాలు, జి.కే.వీధి మండలం రొంపుల గ్రామంలో 60 ఎకరాలు, తూర్పు గోదావరి జిల్లా మోతుగుడెం మండలంలో ఒడియా క్యాంప్ వద్ద 10 ఎకరాలలో పండిస్తున్న గంజాయి పంటను ద్వంసం చేశారు.

పంట నాశనం

గత నాలుగు రోజులుగా 400 మంది పోలీస్, ఎస్​ఈబీ అధికారులు 10 పార్టీలుగా విడిపోయి విశాఖ, తూర్పు గోదావరి జిల్లాల్లో దాదాపు 425 ఎకరాల్లో గంజాయి పంటను నాశనం చేశారు. జి.మాడుగుల మండలం రాచవీధి గ్రామంలో గంజాయి పంటను ద్వంసం చేసే సమయంలో గ్రామస్తులు పోలీసులను అడ్డుకున్నారు. తమకు బ్యాంక్ లోన్స్, ప్రత్యామ్నాయ పంటలకి సంబంధించిన విత్తనాలు అందించాలని కోరారు.

కౌన్సిలింగ్​ చేసిన పోలీసులు

గ్రామస్థులకు పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చి తమ వంతు కృషి చేస్తామని అధికారులు హామీ ఇచ్చారు. పలు గ్రామాల్లో స్థానికులు దాదాపు 130 ఎకరాలల్లో పండిస్తున్న గంజాయి పంటల్ని స్వచ్చందంగా ద్వంసం చేశారని అధికారులు తెలిపారు. పోలీసులు విశాఖ ఏజెన్సీకి చెందిన సర్పంచులు, ఎంపీటీసీలు, స్థానిక నాయకులకు అక్రమ గంజాయి సాగు నివారణపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. వారితో గంజాయి సాగు నివారణ ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో విశాఖ డీఐజీ రంగారావు, జిల్లా ఎస్పీ కృష్ణారావు, నర్సీపట్నం ఏఎస్పీ మణికంఠ, ఇతర అధికారులు పాల్గొన్నారు.

ఇదీ చూడండి:లక్ష్మీదేవి వాళ్లనే వరిస్తుంది.. ఎందుకో తెలుసా?

ABOUT THE AUTHOR

...view details