తెలంగాణ

telangana

ఆన్‌లైన్‌ క్రికెట్‌ బెట్టింగ్ ముఠా అరెస్ట్​... రూ.95 లక్షల విలువైన ప్రాపర్టీని సీజ్‌

By

Published : Aug 5, 2021, 9:13 PM IST

Online

రాచకొండ పోలీసు కమిషనరేట్‌ పరిధిలో గుట్టుచప్పుడు కాకుండా నిర్వహిస్తున్న ఆన్‌లైన్‌ క్రికెట్‌ బెట్టింగ్ ముఠాను పోలీసులు గట్టురట్టు చేశారు. బెట్టింగ్ నిర్వహిస్తున్న వ్యక్తి నుంచి రూ.95 లక్షల విలువైన ప్రాపర్టీని సీజ్‌ చేశారు.

రాచకొండ పోలీసు కమిషనరేట్‌ (Rachakonda Police Commissionerate) పరిధిలో గుట్టుచప్పుడు కాకుండా నిర్వహిస్తున్న ఆన్‌లైన్‌ క్రికెట్‌ బెట్టింగ్ ముఠా (Online Cricket Betting Gang) గుట్టురట్టయింది. ఆన్‌లైన్‌ క్రికెట్‌ బెట్టింగ్ ఆర్గనైజర్‌ షేక్‌ సాదిక్‌ను రాచకొండ ఎస్‌వోటీ పోలీసులు పట్టుకున్నారని పోలీసు కమిషనర్ మహేశ్​ భగవత్‌ తెలిపారు. నిందితుడి నుంచి రూ.95 లక్షల విలువైన ప్రాపర్టీని సీజ్‌ చేయడంతోపాటు రూ.15 లక్షల 70వేల నగదు, 4 మొబైల్‌ ఫోన్లు, 28 క్రెడిట్‌ కార్డులు స్వాధీనం చేసుకున్నామని సీపీ వివరించారు.

ఆర్గనైజర్‌ సాదిక్ కుటుంబ సభ్యులకు చెందిన 9 బ్యాంక్‌ అకౌంట్‌లను గుర్తించి వాటిల్లో ఉన్న రూ.69 లక్షల 3వేల నగదును సీజ్‌ చేశామని చెప్పారు. నిందితుడు షేక్ సాదిక్ పలు యాప్​ల ద్వారా బెట్టింగ్ నిర్వహిస్తాడని తెలిపారు. ఈ యాప్​లను సబ్ స్క్రైబ్ చేసుకుని బుకీల నుంచి ఐడీ, పాస్ వార్డ్ తీసుకుంటున్నాడని సీపీ పేర్కొన్నారు. ఆ తరువాత సోషల్ మీడియాలో ఆసక్తి ఉన్న వారితో బెట్టింగ్​లకు పాల్పడుతుంటారని సీపీ తెలిపారు.

క్రికెట్‌ మ్యాచ్ జరిగేటప్పుడు లింకులను పంపించి బెట్టింగులకు పాల్పడుతాడని పేర్కొన్నారు. టాస్ విన్నింగ్ నుంచి మొదలు పెడితే మ్యాచ్ ముగిసే వరకు బాల్ టూ బాల్ బెట్టింగ్​లకు పాల్పడుతూ డబ్బులు వసూలు చేసి... బెట్టింగ్​లో గెలిచిన వారి నుంచి ముప్పై శాతం కమిషన్ కూడా తీసుకుంటాడని సీపీ తెలిపారు.

ఆన్‌లైన్‌ క్రికెట్‌ బెట్టింగ్ ముఠా గుట్టురట్టు

ఇదీ చూడండి: TS CORONA CASES: రాష్ట్రంలో కొత్తగా 582 కరోనా కేసులు.. 3 మరణాలు

ABOUT THE AUTHOR

...view details