తెలంగాణ

telangana

అటవీ భూముల రగడ.. పోలీసుల రంగప్రవేశం!

By

Published : Jun 29, 2021, 8:40 PM IST

forest land rights
అటవీ భూముల రగడ

రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లిలో ఉద్రిక్తత నెలకొంది. అటవీ భూముల హక్కులు తమవంటే.. తమవంటూ గిరిజనులు పరస్పరం దాడులు చేసుకున్నారు. పోలీసులు రంగప్రవేశం చేయగా గొడవ సద్దుమణిగింది.

అటవీ భూముల రగడ.. పోలీసుల రంగప్రవేశం!

అటవీ భూముల హక్కులు తమవంటే.. తమవంటూ గిరిజనులు పరస్పరం బాహాబాహీకి దిగిన ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండలంలో చోటు చేసుకుంది. గిరిజనులు.. కర్రలు, రాళ్లతో చేసుకున్న పరస్పర దాడులు యుద్ధాన్ని తలపించాయి.

ఇదీ జరిగింది..

ఉమ్మడి వీర్నపల్లికి చెందిన గిరిజనులు కొన్నేళ్లుగా పులిదేవుని ఆలయం పరిధిలోని సుమారు 50 ఎకరాల్లో చెట్లను నరికి వేసి సాగు చేసుకుంటున్నారు. గతంలో ఈ భూమిపై పలుమార్లు బబాయి చెరువు తండా, బావుసింగ్ నాయక్ తండాలకు చెందిన ప్రజలకు మధ్య గొడవలు జరిగాయి. ఇటీవలే మళ్లీ సాగు చేసుకునేందుకు వచ్చిన బావుసింగ్ నాయక్ తండాకు చెందిన గిరిజనులను బాబాయి చెరువు తండా వాసులు అడ్డుకున్నారు.

ఇరు వర్గాల మధ్య జరిగిన వాగ్వివాదం కాస్తా ముదిరి.. ఘర్షణకు దారి తీసింది. గిరిజనులు కర్రలు, రాళ్లతో చేసుకున్న పరస్పర దాడులు యుద్ధాన్ని తలపించాయి. సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటనా స్థలానికి చేరుకున్నారు. వారికి నచ్చజెప్పి గొడవను సద్దుమణిగించారు. హద్దులను తేల్చుకోవాలని వారికి సూచించారు.

ఇదీ చదవండి: Accident: అదుపుతప్పిన ద్విచక్రవాహనం.. వ్యవసాయ బావిలో పడి ముగ్గురు మృతి

ABOUT THE AUTHOR

...view details