తెలంగాణ

telangana

అన్నం పెట్టిన సంస్థకే కన్నం.. నకిలీ బంగారం పెట్టి రూ.కోటితో ఉడాయించిన ఉద్యోగి

By

Published : Sep 21, 2022, 12:35 PM IST

బ్యాంక్​ ఉద్యోగి దోపిడి

SBI Gold Scam: అన్నం పెట్టిన సంస్థకే కన్నం వేశాడో ప్రభుద్దుడు. తాను పని చేస్తున్న సంస్థకే చేతివాటం చూపించాడు. నకిలీ బంగారాన్ని పెట్టి.. కోటి 30 లక్షల రూపాయలను దశల వారిగా దారి మళ్లించాడు. ఈ ఘటన ఏపీలోని పెనగలూరు మండలం ఓబిలిలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్​లో చోటుచేసుకుంది.

SBI Gold Scam in AP: బ్యాంకులో రుణాలు మంజూరు చేసే ఉద్యోగిగా ఉంటూ వీలు చిక్కినప్పుడల్లా తన చేతివాటం చూపించేవాడు. ఎవరికి తెలియదులే అనుకున్నాడు. కానీ దొరికిన తరవాత పారిపోయాడు. ఇది ఆంధ్రప్రదేశ్​ రాష్ట్రంలోని అన్నమయ్య జిల్లాలో బంగారం తాకట్టు పెట్టుకుని రుణాలిచ్చే బ్యాంకు ఉద్యోగే.. ఆ బ్యాంకుకే టోకరా పెట్టాడు.

పెనగలూరు మండలం ఓబిలి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉద్యోగి శేఖరాచారి.. తెలిసిన వారిచేత నకిలీ బంగారం తాకట్టు పెట్టించి.. కోటీ 30 లక్షలు కాజేశాడు. నకిలీ బంగారాన్ని స్వచ్ఛమైన పసిడిగా బ్యాంకు మేనేజర్‌కు చెప్పి రుణాలు ఇప్పించాడు. ఆ డబ్బును సంబంధిత వ్యక్తుల ఖాతాల్లోకి జమ కాగానే వాటిని తన ఖాతాల్లోకి మళ్లించుకునేవాడు. అంతర్గత విచారణలో కొంతకాలంగా శేఖరాచారి ఇలాంటి మోసాలకు పాల్పడుతున్నట్లు నిర్ధారణ అయింది. ఉన్నతాధికారులు విచారణ గురించి తెలుసుకున్న శేఖరాచారి పరారయ్యాడు.

ABOUT THE AUTHOR

...view details