తెలంగాణ

telangana

Viral Audio: యాదాద్రికి వెళ్లిన దివ్యాంగుడి మృతి.. అతడిపై దాడి చేసిందెవరు..?

By

Published : Oct 20, 2021, 4:59 AM IST

one man died in yadadri police attack

కూతురు పుట్టిందన్న ఆనందంలో మొక్కులు చెల్లించుకుందామని యాదాద్రికి వెళ్లిన వ్యక్తి.. మరుసటి రోజు మృతి చెందిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. యాదాద్రిలో తనపై ఎవరో దాడి చేసినట్టు.. బంధువుతో మాట్లాడిన ఆడియోలు ఇప్పుడు వైరల్​గా మారాయి. అయితే.. దాడి చేసింది పోలీసులా..? లేదా.. ఇతరులా..? అన్నది మాత్రం స్పష్టం కావాల్సి ఉంది.

దాడి అనంతరం బంధువుతో ఫోన్​లో మాట్లాడిన ఆడియో టేపు
యాదగిరిగుట్ట నరసింహ స్వామి దర్శనానికి వచ్చిన పాలమూరు యువకుడు మరుసటి రోజు ఆస్వస్థతతో మృతి చెందాడు. సెక్యూరిటీ సిబ్బంది కొట్టిన దెబ్బల వల్లే.. తన కుమారుడు ప్రాణాలు కోల్పోయడంటూ తండ్రి ఆరోపిస్తున్నాడు. ఈ ఘటన సోమవారం చోటుచేసుకున్నట్టు తెలుస్తోంది. మహబూబ్​నగర్ జిల్లా కేంద్రానికి సమీపంలోని కేసీఆర్ ఏకో పార్క్​లో విధులు నిర్వహిస్తున్న కార్తీక్ గౌడ్(32) దంపతులకు ఇటీవలే కూతురు జన్మించింది. ఆ ఆనందంలో ఆదివారం రోజున యాదగిరిగుట్టకు వచ్చి తలనీలాలు సమర్పించి స్వామి వారి దర్శనానికి వెళ్లారు.
కార్తీక్​ ఐడీ కార్డు

అర్ధరాత్రి సమయంలో అటుగా వెళ్తున్న కార్తీక్​ను గుట్టపైన ఇద్దరు వ్యక్తులు అడ్డుకొని చితకబాదారు. తాను పాలమూరు వాసినని.. కేసీఆర్ ఏకో పార్క్​లో పని చేస్తానని చెప్పినా వినిపించుకోకుండా చితకబాదారు. ఈ విషయాన్ని బాధితుడు జడ్చర్లలో ఉన్న తన బంధువుకు ఫోన్​లో తెలియజేశారు.ఇంత రాక్షసంగా వ్యవహారిస్తున్న వారిని వదిలే ప్రసక్తే లేదని.. కేసు పెడతానని ఫోన్​ సంభాషణలో తెలిపాడు. అవసరం అయితే ముఖ్యమంత్రికి కూడా ఫిర్యాదు చేస్తానన్నాడు.

తీవ్రంగా గాయపడిన కార్తీక్ గౌడ్ రాత్రి అక్కడే ఉండి ఉదయం తన మొక్కులు చెల్లించుకుని ఇబ్బందులు పడుతూ హైదరాబాద్ బస్సు ఎక్కినట్టు తెలుస్తోంది. మార్గమధ్యలో కార్తీక్ గౌడ్ సొమ్మసిల్లి బస్సులోనే పడిపోయాడు. ఈ క్రమంలో కొందరు ప్రయాణికులు, ఆర్టీసీ సిబ్బంది ఆటోలో ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. వైద్యులు పరీక్షించి కార్తీక్ గౌడ్ మరణించినట్టు నిర్దరించారు. అతడి ఫోన్​లో ఉన్న వివరాలతో కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు.

కార్తీక్​ పెళ్లి ఫొటో

అప్పటికే విషయం తెలిసిన జడ్చర్లలోని బంధువు.. రాత్రి తమ మధ్య జరిగిన సంభాషణకు సంబంధించి ఆడియోను బంధువులకు పంపినట్టు సమాచారం. కార్తీక్ గౌడ్​పైన ఉన్న దెబ్బలు చూసి కుటుంబ సభ్యులు దిగ్భ్రాంతికి గురయ్యారు. అయితే ఈ దాడి చేసింది పోలీసులా? లేక ఇతరులా? అనే విషయంపై స్పష్టత రావాల్సి ఉంది. సోమవారం రాత్రి మృతదేహాన్ని పాలమూరు తీసుకువెళ్లడంతో బాధితుల రోధనలు మిన్నంటాయి. ఈ మేరకు బాధిత కుటుంబ సభ్యులు యాదగిరిగుట్టలో జరిగిన ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు సన్నద్ధమవుతున్నారు.

ఇదీ చూడండి:

TAGGED:

ABOUT THE AUTHOR

...view details