తెలంగాణ

telangana

Sankranti Rush: జంటనగరాల్లో ప్రయాణికులతో కిటకిటలాడుతున్న ప్రాంగణాలు

By

Published : Jan 9, 2022, 5:24 AM IST

Sankranti Rush: జంటనగరాల్లో ప్రయాణికులతో కిటకిటలాడుతున్న ప్రాంగణాలు

Sankranti Rush: సంక్రాంతి పర్వదినం సందర్భంగా సొంతూళ్లకు వెళ్లే వారితో ప్రయాణప్రాంగణాలు కిటకిటలాడుతున్నాయి. రైల్వేస్టేషన్లు, బస్​స్టేషన్లు ప్రయాణికులతో రద్దీగా మారిపోయాయి. హైదరాబాద్ నుంచి వెళ్లేవారితో ప్రధాన రైల్వే స్టేషన్లయిన సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడ రైల్వేస్టేషన్లు, ఎంజీబీఎస్, జేబీఎస్ వంటి ప్రధాన బస్​స్టేషన్లు సందడిగా మారిపోయాయి. దక్షిణ మధ్య రైల్వే శాఖ 105 ప్రత్యేక రైళ్లను, టీఎస్​ఆర్టీసీ 4,318 ప్రత్యేక బస్సులను నడిపిస్తుంది.

Sankranti Rush: జంటనగరాల్లో ప్రయాణికులతో కిటకిటలాడుతున్న ప్రాంగణాలు

Sankranti Rush: ప్రయాణికులతో బస్టాండ్‌లు, రైల్వేస్టేషన్లు కిటకిటలాడుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం పాఠశాలలకు సెలవులు ప్రకటించడంతో... ప్రజలు సొంతూళ్లకు బయలుదేరుతున్నారు. ప్రయాణికుల సౌకర్యార్థం 105 ప్రత్యేక రైళ్లు, 197 ట్రిప్పులను నడిపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వేశాఖ ప్రకటించింది. దక్షిణ మధ్య రైల్వే నుంచి 37 రైళ్లను.. 92 ట్రిప్పులుగా నడిపించనున్నారు. ఇతర జోన్‌ల నుంచి... 29 రైళ్లతో 38 ట్రిప్పులు నడిపించనున్నారు. సంక్రాంతి పండుగ సందర్భంగా 12 జనసాధరన్ ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది.

Railway stations Rush: ఇక సువిధ రైళ్ల ఛార్జీలతో జేబులకు చిల్లులు పడుతున్నాయని... ప్రయాణికులు వాపోతున్నారు. సికింద్రాబాద్, కాకినాడ స్లీపర్ ఛార్జీ సాధారణంగా 355 రూపాయలు ఉండగా... సువిధ రైలులో వెయ్యి 235 తీసుకుంటున్నారని ప్రయాణికులు వాపోతున్నారు. థర్డ్ ఏసీ సాధారణ టికెట్ 935 రూపాయలు అయితే... సువిధలో 2 వేల 360 వరకు వసూలు చేస్తున్నారని పేర్కొంటున్నారు. సికింద్రాబాద్-విజయవాడ మధ్య స్లీపర్ టికెట్ ఛార్జీ సాధారణంగా 225 రూపాయలు ఉండగా.. సువిధలో 11 వందల 35 రూపాయలు చెల్లించుకోవాల్సి వస్తుందని వాపోతున్నారు. కాచిగూడ- నర్సాపూర్ మధ్య సాధారణ రైలులో స్లీపర్ టికెట్ 320 రూపాయలు ఉండగా.. సువిధ రైలులో వెయ్యి 80 రూపాయలు వరకు వసూలు చేస్తున్నట్లు.. ప్రయాణికులు ఆరోపిస్తున్నారు. ఒక కుటుంబంలో ఐదారుగురు ఉంటే.. వచ్చిన జీతంలో సగానికి సగం రైళ్ల ఛార్జీలకే చెల్లించాల్సి వస్తుందని ప్రయాణికులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.

Bus stations Rush: హైదరాబాద్ నుంచి తెలంగాణ, ఆంద్రప్రదేశ్ రాష్ట్రాలకు ప్రత్యేక బస్సులను టీఎస్​ఆర్టీసీ నడుపుతోంది. ఈ ప్రత్యేక బస్సులకు ఎలాంటి అదనపు ఛార్జీలను వసూలు చేయడంలేదని ఆర్టీసీ స్పష్టం చేసింది. ప్రయాణికుల రద్దీ దృష్ట్యా అదనపు బస్సులను అడ్వాన్స్ రిజర్వేషన్ సౌకర్యం కల్పించారు.

ఇదీ చూడండి:

ABOUT THE AUTHOR

...view details