తెలంగాణ

telangana

'స్వాతంత్య్ర పోరాటం.. హైదరాబాద్‌ సమైక్యతా ఉద్యమంలో భాజపా పాత్ర ఏమిటి?'

By

Published : Sep 17, 2022, 5:35 PM IST

MLC Kavitha
MLC Kavitha ()

MLC Kavitha Tweet on Bjp: స్వాతంత్య్ర పోరాటం... హైదరాబాద్‌ సమైక్యతా ఉద్యమం.. తెలంగాణ పోరాటంలో భాజపా పాత్ర ఏమిటని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రశ్నించారు. తెలంగాణ జాతీయ సమైక్యత దినోత్సవం వేళ... భాజపా నేతలకు ప్రశ్నలు సంధించారు. తెలంగాణ బిడ్డగా భాజపా సమాధానాల కోసం ఎదురు చూస్తున్నానంటూ ఆమె ట్వీట్ చేశారు.

MLC Kavitha Tweet on Bjp: తెలంగాణ జాతీయ సమైక్యతా దినోత్సవం సందర్భంగా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత భాజపాపై పలు ప్రశ్నలు సంధించారు. స్వాతంత్య్ర పోరాటం... హైదరాబాద్ సమైక్యతా ఉద్యమం... తెలంగాణ ఉద్యమంలో భాజపా పాత్ర ఏమిటని ప్రశ్నించారు. తెలంగాణ బిడ్డగా భాజపా సమాధానాల కోసం ఎదురు చూస్తున్నానంటూ ఆమె ట్వీట్ చేశారు. కేంద్ర హోంమంత్రి హైదరాబాద్​లో ఉన్నందున.. భాజపా నేతలు సమాధానం చెప్పాలన్నారు. తెలంగాణ చరిత్రను హైజాక్ చేసేందుకు భాజపా ప్రయత్నిస్తోందని విమర్శించారు. ఎన్నికల కోసం ఉత్సవాలు జరపడం భాజపాకు అలవాటైన సహజసూత్రమని ఆమె ధ్వజమెత్తారు.

రాష్ట్రాలకు వచ్చి ప్రజలకు హామీలివ్వడం, తర్వాత వంచించడం భాజపాకు అలవాటేనని కవిత అన్నారు. దేశంలో ప్రజలకు హక్కులు కల్పించడానికి భాజపా చేసిందేమీ లేదన్నారు. సామరస్యం, ఏకత్వం, ప్రజాబలం సీఎం కేసీఆర్​కు, తెలంగాణకు పునాది అని కవిత పేర్కొన్నారు. రాచరిక పాలన నుంచి ప్రజాస్వామ్యం వైపు అడుగు లేసిన తెలంగాణ నేడు సమైక్యతా దినోత్సవం జరుపుకుంటుందోన్నారు. తెలంగాణ స్వరాష్ట్రంగా మారి సీఎం కేసీఆర్ గారి సారథ్యంలో ప్రగతి పథంలో పయనిస్తూ దేశంలో నంబర్ వన్​గా మారిందన్నారు. జాతీయ సమగ్రత ఉట్టిపడేలా తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాలను నిర్వహించుకోవడం కేసీఆర్ విశాల దృక్పథం వల్లే సాధ్యమైందన్నారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details