తెలంగాణ

telangana

Pension : ఆ ముగ్గురు కళాకారులకు ప్రత్యేక పింఛన్​

By

Published : May 31, 2021, 6:44 PM IST

minister srinivas goud, artists
మంత్రి శ్రీనివాస్ గౌడ్, జానపద కళాకారులు

సీఎం కేసీఆర్ జానపద కళలకు ప్రాముఖ్యత కల్పిస్తున్నారని సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు కిన్నెర విద్వాంసుడు మొగులయ్య, గుస్సాడీ నృత్యకారుడు కనకరాజు, ఫొటోగ్రాఫర్ భరత్​భూషణ్​లకు ప్రత్యేక పింఛను అందజేశారు.

ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ ఖ్యాతిని ప్రపంచస్థాయికి తీసుకువెళ్తున్నారని పర్యాటక, సాంస్కృతికశాఖ మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ అన్నారు. పురాతన జానపద కళలకు ప్రాముఖ్యత కల్పించి ప్రోత్సహిస్తున్నారని తెలిపారు. హైదరాబాద్‌లోని తన నివాసంలో నాగర్‌ కర్నూల్‌ జిల్లా లింగాల మండలం అవుసలకుంట గ్రామానికి చెందిన 12మెట్ల కిన్నెర విద్వాంసుడు దర్శనం మొగులయ్య, కుమురంభీం జిల్లాకు చెందిన గుస్సాడీ నృత్య కళాకారుడు పద్మశ్రీ అవార్డు గ్రహిత కనకరాజు, ప్రముఖ ఫొటోగ్రాఫర్ భరత్‌భూషణ్‌లకు సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు 10వేల రూపాయల ప్రత్యేక పింఛన్‌ మంజూరు చేస్తూ ఉత్తర్వులు అందజేశారు.

కనకరాజు, దర్శనం మొగులయ్యలకు శాలువా కప్పి సన్మానించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్‌ గువ్వల బాలరాజు, సాంస్కృతికశాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ పాల్గొన్నారు.

ఇదీ చదవండి:రేపు ప్రారంభం కావల్సిన ఇంటర్ ఆన్​లైన్ తరగతులు వాయిదా

ABOUT THE AUTHOR

...view details