తెలంగాణ

telangana

White challenge issue: న్యాయస్థానంలో పరువునష్టం దావా దాఖలు చేశా: కేటీఆర్

By

Published : Sep 20, 2021, 11:19 AM IST

Updated : Sep 20, 2021, 2:31 PM IST

White challenge issue

పీసీసీ ఛీఫ్‌ రేవంత్‌ రెడ్డి వ్యాఖ్యలపై కేటీ రామారావు ( twitter war between ktr and revanth) మరోసారి తీవ్రంగా స్పందించారు. వదంతులు వ్యాప్తి చేస్తున్నారనీ... తనపై లేనిపోని అసత్యాలను ప్రచారం చేస్తున్నారని విమర్శించిన కేటీఆర్ (ktr)... దీనిపై న్యాయపరమైన చర్యలు తీసుకోనున్నట్టు ప్రకటించారు. కోర్టులో పరువునష్టం దావా (defamation case) వేసినట్టు ట్వీట్‌ చేశారు.

మంత్రి కేటీఆర్​, పీసీసీ అధ్యక్షుడు రేవంత్​రెడ్డి మధ్య ట్విటర్​ యుద్ధం ( twitter war between ktr and revanth) కొనసాగుతోంది. డ్రగ్స్​ పరీక్షల కోసం రేవంత్​ విసిరిన వైట్​ ఛాలెంజ్​పై స్పందించిన కేటీఆర్​... ‘‘ఎలాంటి పరీక్షలకైనా సిద్ధంగా ఉన్నా. కాంగ్రెస్‌ తరఫున రాహుల్‌ గాంధీ సిద్ధమేనా?'' అని ప్రశ్నించారు. రాహుల్ (Rahul gandhi) ఒప్పుకుంటే దిల్లీ ఎయిమ్స్‌లో పరీక్షలకు సిద్ధమని ప్రకటించారు. చర్లపల్లి జైలుకు వెళ్లొచ్చిన వారితో తన స్థాయి కాదని వ్యంగ్యాస్త్రం సంధించారు. క్లీన్‌చిట్‌ వస్తే రేవంత్‌ (revanth reddy) క్షమాపణ చెప్పి పదవులు వదులుకుంటారా? ఓటుకు నోటు కేసులో (vote for note case) లైడిటెక్టర్‌ పరీక్షలకు సిద్ధమా’’ అని కేటీఆర్‌ ట్విటర్‌( ktr tweet) వేదికగా సవాల్‌ విసిరారు.

ఎలాంటి పరీక్షలకైనా సిద్ధంగా ఉన్నా... కాంగ్రెస్ తరఫున రాహుల్‌గాంధీ సిద్ధమేనా? రాహుల్‌ ఒప్పుకుంటే దిల్లీ ఎయిమ్స్‌లో పరీక్షలకు సిద్ధం. చర్లపల్లి జైలుకు వెళ్లొచ్చిన వారితో నాస్థాయి కాదు. క్లీన్‌చిట్ వస్తే రేవంత్ క్షమాపణ చెప్పి పదవులు వదులుకుంటారా?. ఓటుకు నోటు కేసులో రేవంత్‌ లైడిటెక్టర్ పరీక్షలకు సిద్ధమా?

- కేటీఆర్​, పురపాలక శాఖ మంత్రి

మంత్రి కేటీఆర్‌ ట్వీట్‌కు స్పందించిన రేవంత్ రెడ్డి.. ముఖ్యమంత్రి కేసీఆర్‌తో కలిసి లైడిటెక్టర్ పరీక్షకు సిద్ధమని ప్రకటించారు. లైడిటెక్టర్ పరీక్షకు సమయం, స్థలం చెప్పాలని ప్రతిసవాల్‌ విసిరారు. అవినీతి ఆరోపణలు, సీబీఐ కేసులు, సహారా పీఎఫ్ అక్రమాలు, ఈఎస్​ఐ ఆస్పత్రుల నిర్మాణంలో అక్రమాలపై లైడిటెక్టర్ పరీక్షలకు కేసీఆర్‌ సిద్ధమా? అని రేవంత్‌ ట్విటర్ ద్వారా ప్రశ్నించారు.

సీఎం కేసీఆర్‌తో కలిసి లైడిటెక్టర్ పరీక్షకు సిద్ధం. లైడిటెక్టర్ పరీక్షకు సమయం, స్థలం చెప్పండి. కేసీఆర్‌పై అవినీతి ఆరోపణలపై లైడిటెక్టర్ పరీక్షకు సిద్ధం. సీబీఐ కేసులు, సహారా పీఎఫ్ అక్రమాలపై లైడిటెక్టర్ పరీక్షలకు సిద్ధమా?. ఈఎస్ఐ ఆస్పత్రుల నిర్మాణంలో అక్రమాలపై లైడిటెక్టర్ పరీక్షకు సిద్ధమా?

- రేవంత్​రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు

ఈ ఆరోపణలపై మండిపడ్డ కేటీఆర్ ఉద్దేశపూర్వకంగా తనపై దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. చట్టపరమైన చర్యలకు ప్రక్రియను ప్రారంభించినట్లు ట్విటర్​ వేదికగా స్పష్టం చేశారు. న్యాయస్థానంలో పరువునష్టం దావా దాఖలు ( defamation case) చేసినట్లు తెలిపారు. దుష్ప్రచారం చేస్తున్న వారిపై కోర్టు చర్యలు తీసుకుంటుందని విశ్వసిస్తున్నట్లు చెప్పారు.

ఉద్దేశపూర్వకంగా నాపై దుష్ప్రచారం చేస్తున్నారు. చట్టపరమైన చర్యలకు కోర్టును ఆశ్రయిస్తున్నా.. న్యాయస్థానంలో పరువునష్టం దావా దాఖలు చేశా. దుష్ప్రచారం చేస్తున్న వారిపై కోర్టు చర్యలు తీసుకుంటుందని విశ్వసిస్తున్నా...

- కేటీఆర్​, పురపాలక శాఖ మంత్రి

మరోవైపు రేవంత్‌ విసిరిన వైట్‌ ఛాలెంజ్‌కు (revanth reddy white challenge) మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి (ex mp konda vishweshwar reddy) కూడా స్పందించారు. మ.12గంటలకు గన్‌పార్క్‌ అమరవీరుల స్థూపం వద్దకు రానున్నట్లు తెలిపారు. రేవంత్‌రెడ్డి వైట్‌ ఛాలెంజ్‌పై మాణికం ఠాగూర్ (Manickam Tagore) సైతం స్పందించారు. వైట్ ఛాలెంజ్‌ను విశ్వేశ్వరరెడ్డి స్వీకరించడం మంచి పరిణామమన్నారు. మరి డ్రగ్స్ బ్రాండ్ అంబాసిడర్ ఈ సవాల్​ను స్వీకరిస్తారా అని ట్వీట్ చేశారు.

అసలు ఏంటీ వైట్​ ఛాలెంజ్​

గ్రీన్‌ ఛాలెంజ్‌ మాదిరి మంత్రి కేటీఆర్‌, కొండా విశ్వేశ్వర్‌రెడ్డికి వైట్‌ ఛాలెంజ్‌ (white challenge) విసురుతున్నానని ఇటీవల రేవంత్‌ (revanth reddy) ప్రకటించారు. గన్‌ పార్క్‌ వద్దకు వస్తానని.. వైట్‌ ఛాలెంజ్‌లో భాగంగా ఉస్మానియా ఆసుపత్రికి వెళ్దామన్నారు. డ్రగ్స్‌ పరీక్షల కోసం వైద్యులకు నమూనాలు ఇద్దామని రేవంత్‌ సవాల్‌ (revanth saval) విసిరారు. డ్రగ్స్‌ కేసుపై (tollywood drugs case) మంత్రి కేటీఆర్‌ ఎందుకు స్పందించరని రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు. ఒక మంత్రిగా మీరెందుకు జోక్యం చేసుకోకూడదని నిలదీశారు. డ్రగ్స్‌ కేసులో ఈడీకి ఆబ్కారీశాఖ వివరాలు ఎందుకు ఇవ్వలేదన్నారు. ఎక్సైజ్‌శాఖ విచారణలో రకుల్‌ప్రీత్, రానా పేర్లు లేవన్న రేవంత్​రెడ్డి.. ఇప్పుడు ఈడీ విచారణకు ఎందుకు పిలిచిందని ప్రశ్నించారు. రానా, రకుల్‌ప్రీత్‌ను ఎక్సైజ్‌శాఖ విచారణ నుంచి కాపాడిందెవరని ప్రశ్నించారు.

సినిమా పరిశ్రమతో సంబంధం ఉన్న డ్రగ్స్‌ కేసును విచారిస్తున్న ఈడీకి అబ్కారీ శాఖ ఎందుకు సహకరించడం లేదని రేవంత్‌ రెడ్డి అన్నారు. వివరాలు ఇచ్చేందుకు ఎక్సైజ్‌ శాఖ నిరాకరిస్తున్నప్పుడు ఒక మంత్రిగా ఎందుకు జోక్యం చేసుకోలేదన్నారు.

Last Updated :Sep 20, 2021, 2:31 PM IST

ABOUT THE AUTHOR

...view details