తెలంగాణ

telangana

'మా కమాండర్​కు ఏమైనా జరిగితే మీదే బాధ్యత' ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ మావోయిస్టుల లేఖ

By

Published : Sep 7, 2022, 10:35 PM IST

Updated : Sep 7, 2022, 10:43 PM IST

మావోయిస్టుల లేఖ

Maoist commander Rajitha arrest: అపహరించిన మావోయిస్టులకు ఎటువంటి హాని తలపెడితే ప్రభుత్వానిదీ, పోలీసులదే బాధ్యతనీ మావోయిస్టులు లేఖ రాశారు. దీనివల్ల వారు భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని అందులో పేర్కొన్నారు. వారిని వెంటనే దగ్గరలోని కోర్టులో హాజరు పరచాలని డిమాండ్​ చేశారు.

Maoist commander Rajitha arrest: గత రెండు రోజుల నుంచి తెలంగాణ, చత్తీస్​ఘడ్​ రాష్ట్రాల పోలీసులు భారీ బందోబస్తులో భద్రాది కొత్తగూడెం ప్రాంతం అడవులను పూర్తిగా జల్లెడ పడుతున్నారు. దీంతో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోలీసుల అదుపులో మావోయిస్టు మహిళా నేత రజిత ఉన్నట్లు ప్రచారం జోరందుకుంది. ఈమె మావోయిస్టు పార్టీ అగ్ర నేత దామోదర్ భార్య. మనకన పల్లి గ్రామానికి చెందిన మహిళగా గుర్తించారు. ఈ మేరకు మావోయిస్టులు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో లేఖను విడుదల చేశారు.

రజిత, మావోయిస్టు మహిళా నేత

భద్రాద్రి కొత్తగూడెం అల్లూరి సీతారామరాజు డివిజన్ కమిటీ కార్యదర్శి ఆజాద్ పేరుతో లేఖ విడుదల చేశారు. ఈరోజు ఉదయం తెల్లవారుజామున తెలంగాణ ఛత్తీస్​గఢ్​ రాష్ట్రాల పోలీసులు సంయుక్తంగా డోకుపాడు, కూర్ణపల్లి, కోనవాయి గ్రామాలపై దాడి చేశారు. అనంతరం అనారోగ్యంతో ఉన్న చర్ల మావోయిస్టు కమాండర్ రజితను, మరో నలుగురు దళ సభ్యులను అదుపులోకి తీసుకున్నట్లు లేఖలో పేర్కొన్నారు. వీరిని వెంటనే పోలీసుల అదుపులో నుంచి దగ్గరలో ఉన్న కోర్టులో హాజరు పరచాలని డిమాండ్​ చేశారు.

పోలీసుల చెరలో ఉన్న మావోయిస్టులను ఎన్​కౌంటర్ పేరుతో హతమార్చిన​ లేక ఎటువంటి ప్రాణ హాని తలపెట్టిన ప్రభుత్వానిది, పోలీసులదే బాధ్యత అని మావోయిస్టులు లేఖలో పేర్కొన్నారు. వీరికి ఎటువంటి హాని జరిగినా అధికార పార్టీ నాయకులు భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. పోలీసులు మాత్రం మావోయిస్టుల అరెస్ట్​ను ధ్రువీకరించలేదు.

ఇవీ చదవండి:

Last Updated :Sep 7, 2022, 10:43 PM IST

ABOUT THE AUTHOR

...view details