తెలంగాణ

telangana

KRMB, GRMB Meeting: కృష్ణా, గోదావరి నదీ యాజమాన్య బోర్డుల భేటీ... తెలంగాణ గైర్హాజరు

By

Published : Aug 9, 2021, 11:35 AM IST

Updated : Aug 9, 2021, 1:55 PM IST

KRMB, GRMB Meeting
కృష్ణా, గోదావరి నదీ యాజమాన్య బోర్డుల భేటీ

11:32 August 09

కృష్ణా, గోదావరి నదీ యాజమాన్య బోర్డుల భేటీ

కృష్ణా, గోదావరి నదీ యాజమాన్య బోర్డుల సమావేశం (Krishna and Godavari river boards meeting ) జరిగింది. జలసౌధలో కేఆర్‌ఎంబీ, జీఆర్‌ఎంబీ (KRMB, GRMB ) ఛైర్మన్ల నేతృత్వంలో భేటీ సాగింది. సమావేశంలో బోర్డుల సభ్య కార్యదర్శులు, సభ్యులు పాల్గొన్నారు. 

ఏపీ జలవనరులశాఖ కార్యదర్శి, ఈఎన్‌సీ, ఇంజినీర్లు హాజరయ్యారు. రెండు బోర్డుల సమావేశానికి తెలంగాణ సభ్యులు  గైర్హాజరయ్యారు. భేటీకి హాజరుకాలేమని బోర్డులకు ఇప్పటికే తెలంగాణ లేఖలు రాసింది. లేఖల ప్రతులను బోర్డు ఛైర్మన్లకు ఉదయంఅధికారులు  అందించారు. కేంద్ర గెజిట్ నోటిఫికేషన్ అమలు, కార్యాచరణ ఖరారుపై చర్చించారు. 

గెజిట్ నోటిఫికేషన్‌లో అభ్యంతరాలపై కేంద్రం దృష్టికి తీసుకెళ్తామని ఏపీ పేర్కొంది. అభ్యంతరాలు లేని ప్రాజెక్టుల వివరాలు ఇస్తామని ఏపీ అధికారులు తెలిపారు. వివరాల సమర్పణకు వారం గడువు కోరారు. అభ్యంతరాలను కేంద్రం దృష్టికి తీసుకెళ్లవచ్చని బోర్డు ఛైర్మన్లు పేర్కొన్నారు. బోర్డులు అడిగిన సమాచారం ఇవ్వాలని ఛైర్మన్లు అన్నారు. నెలలో గెజిట్‌ అమలు, కార్యాచరణ పూర్తయ్యే అవకాశం లేదని తెలిపారు. గెజిట్‌ అమలుపై కేంద్ర జలశక్తిశాఖకు నివేదిస్తామని చెప్పారు.

ఇదీ చదవండి:కృష్ణా, గోదావరి బోర్డుల భేటీకి హాజరుకాలేం.. ప్రభుత్వం మరో లేఖ

Last Updated :Aug 9, 2021, 1:55 PM IST

ABOUT THE AUTHOR

...view details