తెలంగాణ

telangana

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు 30 రోజుల బోనస్‌!

By

Published : Oct 19, 2021, 5:29 PM IST

Updated : Oct 19, 2021, 7:02 PM IST

Govt sanctions ad hoc bonus to employees for FY21
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు బోనస్​

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్​న్యూస్​. 2020-21 సంవత్సరానికిగానూ బోనస్​ వచ్చింది. రూ. 7 వేల నెలవారీ జీతం ఆధారంగా కేంద్రం దీనిని లెక్కించి ఇచ్చింది.

ఉత్పాదక ఆధారిత బోనస్‌ పరిధిలోకి రాని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు (Bonus for Central government employees) 30 రోజుల అనుత్పాదక ఆధారిత బోనస్‌ను ప్రకటిస్తూ కేంద్ర ఆర్థికశాఖ ఉత్తర్వులు జారీచేసింది. గ్రూప్‌-బి కిందికి వచ్చే నాన్‌గెజిటెడ్‌ ఉద్యోగులందరితోపాటు, గ్రూప్‌-సి ఉద్యోగులకు కూడా ఇది వర్తిస్తుందని పేర్కొంది. (Bonus for Central government employees)

కేంద్ర పారామిలిటరీ దళాలు, సాయుధ దళాల్లోని అర్హులైన ఉద్యోగులకూ ఈ బోనస్‌ వర్తిస్తుందని ఆర్థికశాఖ పేర్కొంది.రూ.7వేల నెలవారీ జీతం ఆధారంగా ఈ బోనస్‌ను లెక్కించి ఇస్తారు.

2021 మార్చి 31 నాటికి సర్వీసులో ఉండి, 2020-21 ఆర్థిక సంవత్సరంలో వరుసగా కనీసం ఆరునెలల సర్వీసు ఉన్నవారు మాత్రమే ఈ బోనస్‌ పొందడానికి అర్హులని వెల్లడించింది. ఆర్థికశాఖ లెక్కల ప్రకారం అర్హులైన ఉద్యోగులు ఒక్కొక్కరికి రూ.6,907 బోనస్‌ రానుంది.

వారికి కూడా...

ఈ ఏడాది మార్చి 31కు ముందు ఆరోగ్య కారణాల వల్ల రిటైర్ అయిన, మరణించిన ఉద్యోగులకు బోనస్ ఇస్తామని కేంద్రం తెలిపింది. అయితే ఈ ఉద్యోగులు ఆ ఏడాదిలో ఆరు నెలలు రెగ్యులర్ సర్వీస్​లో ఉండాలని స్పష్టం చేసింది.

ఇదీ చదవండి:'ఆర్ వ్యాల్యూ' ఒకటి లోపే- కరోనా కంట్రోల్ అయినట్టేనా?

Last Updated :Oct 19, 2021, 7:02 PM IST

ABOUT THE AUTHOR

...view details