తెలంగాణ

telangana

మోదీపై 'బంగారు' అభిమానం.. 156 గ్రాములతో స్వర్ణ విగ్రహం

By

Published : Jan 20, 2023, 9:55 AM IST

Surat jewelers carve PM Modi in 156 gms gold

ఓ స్వర్ణకారుల బృందం ఏకంగా 156 గ్రాముల ప్రధాని మోదీ బంగారు విగ్రహాన్ని తయారు చేశారు. అసలు ఆ విగ్రహం కథేంటో.. దాని వివరాలేంటో తెలుసుకుందాం.

ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై ఉన్న అభిమానంతో ఆయన బంగారు ప్రతిమను తయారు చేశాడు ఓ స్వర్ణకారుడు. గుజరాత్​ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధాని మోదీ సాధించిన విజయాన్ని పురస్కరించుకుని.. సూరత్​కు చెందిన సందీప్​ జైన్​ 156 గ్రాముల బరువున్న బంగారు విగ్రహాన్ని తయారు చేశారు. ఈ విగ్రహాన్ని 18 క్యారెట్ల బంగారంతో తయారు చేశారు. ఈ బంగారు విగ్రహాన్ని రూపొందించేందుకు రూ.11 లక్షలు ఖర్చు అయ్యాయని తెలిపారు. దీనిని తయారు చేసేందుకు దాదాపు 20 మంది కళాకారులు 3 నెలల పాటు శ్రమించారని పేర్కొన్నారు. గుజరాత్​ అసెంబ్లీ ఎన్నికల్లో భాజపా గెలవగానే విగ్రహం పని మొదలు పెట్టామని చెప్పారు సందీప్ జైన్​.

“మన దేశ ప్రజలు బంగారాన్ని చాలా ఎక్కువగా ఇష్టపడతారు. ఇక దేశ ప్రధాని నరేంద్ర మోదీని పొగిడేందుకు మాటలు కూడా సరిపోవు. ఆయనకు ప్రజల మనోభావాలు బంగారం కంటే తక్కువ కాదు. ప్రజలు ఆయనను ఎంతగా ఆరాధిస్తారో తెలియజేయడానికే మేము ఆయన విగ్రహాన్ని బంగారంతో తయారు చేశాము. గుజరాత్ ఎన్నికల్లో భాజపా 156 సీట్లు గెలుచుకున్నప్పుడు.. ప్రధాని మోదీ విగ్రహాన్ని తయారు చేయాలని మా స్వర్ణకారుల బృందం నిర్ణయించుకున్నాం. ఈ విగ్రహం బరువు 156 గ్రాములు. దీని బరువు భాజపా సాధించిన సీట్ల సంఖ్యకు సమానం. విగ్రహం పూర్తి చేయడానికి 20 నుండి 25 మంది బృందం మూడు నెలల పాటు శ్రమించింది."

సందీప్ జైన్, స్వర్ణకారుడు

ప్రధాని మోదీ స్ఫూర్తికి, కృషికి గుర్తుగా ఈ విగ్రహాన్ని రూపొందించినట్లు మరో స్వర్ణకారుడు వసంత్ బోహ్రా తెలిపారు. ఈ విగ్రహం ప్రధాని మోదీని తలపించే విధంగా ఉందని, గుజరాత్ ఫలితాలతో తాను సంతృప్తి చెందానని బోహ్రా అన్నారు. ఆయన కళ్లద్దాలు, ముఖం కళ్ళు వంటివి అచ్చుగుద్దినట్లుగా తయారు చేశామని పేర్కొన్నారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details