తెలంగాణ

telangana

సుప్రీంకోర్టులో కరోనా కలవరం- 250మందికి పాజిటివ్

By

Published : Jan 10, 2022, 11:29 AM IST

సుప్రీంకోర్టులో కరోనా

Supreme Court Covid: సుప్రీంకోర్టులో కరోనా కలకలం రేపింది. కోర్టులో వివిధ విభాగాల్లో పనిచేస్తున్న 250 మందికి పైగా సిబ్బందికి కరోనా నిర్ధరణ అయినట్లు సుప్రీంకోర్టు వర్గాలు వెల్లడించాయి.

Supreme Court Covid: దేశవ్యాప్తంగా కొవిడ్​-19 విజృంభణ కొనసాగుతున్న వేళ.. దేశ అత్యుత్తమ న్యాయస్థానం సుప్రీంకోర్టులో కొవిడ్ కలకలం రేపింది. కోర్టులో విధులు నిర్వర్తించే 250 మందికి పైగా కరోనా నిర్ధరణ అయినట్లు సుప్రీంకోర్టు వర్గాలు తెలిపాయి.

జడ్జీల వద్ద వ్యక్తిగత సహాయకులుగా ఉన్న వారికి కూడా కరోనా పాజిటివ్ తేలినట్లు పేర్కొన్నాయి. దాదాపు ఏడుగురు సుప్రీంకోర్టు జడ్జీలకు పాజిటివ్ గా వచ్చినట్లు వెల్లడించాయి.

మరోవైపు.. దేశంలో రోజువారీ కొవిడ్​ కేసులు భారీగా నమోదవుతున్నాయి. ఆదివారం ఉదయం నుంచి సోమవారం ఉదయం వరకు 1,79,723 మంది వైరస్ బారిన పడ్డారు. కరోనా వల్ల మరో 146మంది మృతి చెందారు.

ఇదీ చూడండి:దేశంలో మరో 1.80 లక్షల కేసులు.. భారీగా తగ్గిన మరణాలు

ABOUT THE AUTHOR

...view details