తెలంగాణ

telangana

కేరళపై కరోనా పంజా- ఒక్కరోజే 54,000 కేసులు

By

Published : Jan 28, 2022, 8:29 PM IST

Updated : Jan 28, 2022, 9:45 PM IST

State wise covid cases
State wise covid cases

State Wise Covid Cases: కేరళలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. కొత్తగా 54 వేల మందిపైగా వైరస్​ బారిన పడ్డారు. మరోవైపు కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర సహా పలు రాష్ట్రాల్లో రోజువారీ కొవిడ్​ కేసుల్లో తగ్గుదల కనిపిస్తోంది. మహారాష్ట్రలోని ధారావిలో సున్నా కొవిడ్​ కేసులు నమోదయ్యాయి.

State Wise Covid Cases: దేశంలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. కేరళలోనే కొత్త కేసుల సంఖ్య ఆందోళనకర స్థాయిలో పెరుగుతోంది. ఒక్కరోజే 54,537 కేసులు నమోదవగా.. వైరస్ ధాటికి మరో 352 మంది బలయ్యారు. కరోనా ప్రారంభమైనప్పటి నుంచి ఒక్కరోజులో నమోదైన కేసుల్లో ఇవే అత్యధికం. రాష్ట్రంలో మొత్తం కొవిడ్ బాధితుల సంఖ్య 58.81 లక్షలు దాటగా.. మరణాల సంఖ్య 52,786కు చేరింది.

కర్ణాటకలో రోజువారీ కేసులు భారీగా తగ్గుముఖం పట్టాయి. తాజాగా 31,198 మందికి పాజిటివ్​గా తేలింది. దీంతో యాక్టివ్​ కేసుల సంఖ్య 2,88,767కు చేరింది. పాజిటివిటీ రేటు 20.91 శాతానికి చేరింది. కాగా వైరస్​ ధాటికి మరో 50 మంది మరణంచారు.

మహారాష్ట్రలో కొత్తగా 24,948 మందికి కరోనా సోకినట్లు తేలింది. మరో 103 మంది చనిపోయారు. 45,648 మంది వైరస్​ను జయిచారు. మరోవైపు రాష్ట్రంలో 110 మందికి ఒమిక్రాన్ పాజిటివ్​గా తేలింది.

దిల్లీలో కొత్తగా 4,044 కేసులు బయటపడ్డాయి. మరో 25 మంది మృతి చెందారు. పాజిటివిటీ రేటు 8.60 శాతానికి తగ్గింది.

మూడోదశ ప్రారంభమైన తర్వాత మహారాష్ట్ర ముంబయిలోని ధారావిలో 39 రోజుల అనంతరం సున్నా కేసులు నమోదైనట్లు అధికారులు తెలిపారు. గతేడాది డిసెంబరు 20న సున్నా కేసులను నమోదైనట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం అక్కడ 43 యాక్టివ్ కేసులున్నాయి.

వివిధ రాష్ట్రాల్లో కరోనా కేసులు..

రాష్ట్రం కొత్త కేసులు కొత్త మరణాలు
కేరళ 54,537 352
కర్ణాటక 31,198 50
తమిళనాడు 26,533 48
మహారాష్ట్ర 24,948 103
ఆంధ్రప్రదేశ్ 12,561 12
గుజరాత్​ 12,131 30
రాజస్థాన్​ 8,125 21
మధ్యప్రదేశ్​ 7,763 05
ఒడిశా 5,057 10
హరియాణా 4,630 19
జమ్ముకశ్మీర్ 4,354 05
దిల్లీ 4,044 25
ఛత్తీస్​గడ్​ 3,919 --
తెలంగాణ 3,877 02
మిజోరం 2,064 00

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోనిలో రిజిస్ట్రేషన్ ఉచితం!

ఇదీ చూడండి:దక్షిణాది రాష్ట్రాలకు కేంద్ర ఆరోగ్యమంత్రి కీలక సూచనలు

Last Updated :Jan 28, 2022, 9:45 PM IST

ABOUT THE AUTHOR

...view details