తెలంగాణ

telangana

కేరళలో మరోసారి షిగెల్లా కలకలం.. కోజికోడ్​​లో తొలి కేసు

By

Published : Apr 28, 2022, 11:15 AM IST

Updated : Apr 28, 2022, 11:36 AM IST

Shigella infection reported in Kerala's Kozhikode
కేరళలో షిగెల్లా కేసు

Shigella News: కేరళ కోజికోడ్​లోని ఏడేళ్ల బాలికకు షిగెల్లా సోకింది. ఆమె పొరుగింట్లోని మరో చిన్నారిలో కూడా వ్యాధి లక్షణాలు గుర్తించినట్లు అధికారులు తెలిపారు. అయితే మిగతా ఎవరికీ వ్యాధి వ్యాపించలేదని, ప్రస్తుతం ఇద్దరు చిన్నారుల ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని స్పష్టం చేశారు.

Kerala Shigella: కేరళలో మరోసారి షిగెల్లా కేసు వెలుగుచూసింది. కోజికోడ్​లోని పుత్తియప్పలో ఏడేళ్ల బాలికలో ఈ వ్యాధిని గుర్తించినట్లు అధికారులు చెప్పారు. ఏప్రిల్​ 27నే కేసు నమోదైందని, ఇంకా ఎవరికీ వ్యాపించలేదని పేర్కొన్నారు. ఏప్రిల్​ 20న బాలికలో షిగెల్లా లక్షణాలు కనిపించాయని, మలంలో రక్తాన్ని గుర్తించిన తర్వాత పరీక్ష నిర్వహిస్తే పాజిటివ్​గా తేలినట్లు వివరించారు. బాలిక పొరుగింట్లోని మరో చిన్నారిలోనూ వ్యాధి లక్షణాలున్నాయని చెప్పారు. ప్రస్తుతం ఇద్దరి ఆరోగ్య పరిస్థితి బాగానే ఉందని స్పష్టం చేశారు. షిగెల్లా అనే బ్యాక్టీరియా శరీరంలోకి ప్రవేశించడం ద్వారా ఈ వ్యాధి వస్తుంది. ఇది ఒకరినుంచి మరొకరికి సులభంగా వ్యాప్తి చెందుతుంది. లక్షణాలు తీవ్రమైతే చనిపోయే ప్రమాదం ఉంది. అందుకే జాగ్రత్తలు పాటించడం తప్పనిసరి.

షిగెల్లా వ్యాధి లక్షణాలు:జ్వరం, కడుపునొప్పి, వాంతులు, విరేచనాలు, అలసట మొదలైనవి షిగెల్లా వ్యాధి ప్రథమ లక్షణాలు.

  • కలుషిత నీరు, పాడైన ఆహారం సేవించడం వల్ల ఈ వ్యాధి ఎక్కువగా వ్యాపిస్తుంది.
  • ఈ వ్యాధి సంక్రమణ ఐదేళ్లలోపు పిల్లలకు ప్రమాదకారిగా మారే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
  • షిగెల్లా వైరస్​ వ్యాప్తి చాలా వేగంగా ఉంటుంది. వ్యాధిగ్రస్తుడితో ప్రత్యక్షంగా గానీ, పరోక్షంగా గానీ కాంటాక్ట్​లోకి వస్తే వ్యాధి సోకే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి .
  • 2 నుంచి 7 రోజుల్లో వ్యాధి లక్షణాలు బయటపడతాయి. కొన్ని సందర్భాల్లో ఎక్కువ సమయం పట్టొచ్చు.

వ్యాధి సోకకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు:కాచిచల్లార్చిన నీరు మాత్రమే తాగాలి.

  • తరచుగా.. సబ్బుతో చేతులు శుభ్రంగా కడుక్కోవాలి.
  • మంచి ఆహారం సేవించాలి.
  • బహిరంగ ప్రదేశాల్లో మల, మూత్ర విసర్జన చేయకూడదు.
  • ఉపయోగించిన డైపర్లను సరైన పద్ధతిలో పడేయాలి.
  • వ్యాధి లక్షణాలు ఉన్నవారు వంటలు చేయకూడదు.
  • నీటిని, ఆహార పాత్రలను మూతలతో కప్పి ఉంచాలి.
  • విరేచనాలు ఉన్న పిల్లలను ఇతరులతో కలవనివ్వకూడదు.
  • వ్యాధిగ్రస్తులతో కలవకపోవడం శ్రేయస్కరం.
  • వ్యాధి లక్షణాలు ఉన్నవారు ఓఆర్​ఎస్, ఉప్పు ద్రావణం, కొబ్బరి నీరు వంటివి తాగి రీహైడ్రేట్ చేసుకోవాలి.

ఇదీ చదవండి:దేశంలో 3వేలు దాటిన కరోనా కొత్త కేసులు

Last Updated :Apr 28, 2022, 11:36 AM IST

ABOUT THE AUTHOR

...view details