తెలంగాణ

telangana

మాజీ హోంమంత్రి ఇంట్లో 'రూ.కోటి' చోరీ.. ఒడిశాలో దొంగ అరెస్ట్​

By

Published : Aug 1, 2022, 9:39 PM IST

Theft in karnataka ex minister house:

Theft in karnataka ex minister house: కర్ణాటక మాజీ హోంమంత్రి, కాంగ్రెస్​ సీనియర్​ నేత ఎంబీ పాటిల్ నివాసంలో దొంగతనం చేసిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. సుమారు రూ.కోటి విలువైన వస్తువులు, నగదు చోరీ కేసులో నిందితుడిని ఒడిశాలో అదుపులోకి తీసుకున్నారు కర్ణాటక పోలీసులు.

Theft in karnataka ex minister house: కర్ణాటక మాజీ హోంమంత్రి, కాంగ్రెస్​ సీనియర్​ నేత ఎంబీ పాటిల్ ఇంట్లో చోరీ కేసులో పోలీసులు దొంగను పట్టుకున్నారు. బెంగళూరు సదాశివనగర్​లోని మంత్రి నివాసంలో గతంలో సుమారు రూ.కోటి విలువైన నగదు, వస్తువులు చోరీ అయ్యాయి. ఇందులో రూ.85 లక్షల విలువైన విదేశీ నగదు, ఆరు ఖరీదైన వాచీలు పోయాయని.. మంత్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన పోలీసులు.. తాజాగా దొంగను పట్టుకున్నారు.

నిందితుడు

కొన్ని నెలల క్రితం సదాశివనగర్​లోని మాజీమంత్రి ఎంబీ పాటిల్​ ఇంట్లో దొంగతనం జరిగింది. దీనిపై మంత్రి పోలీసులకు ఫిర్యాదు చేయగా.. ఒడిశాకు చెందిన జయంత్​ అనే వ్యక్తిని అరెస్ట్ చేశారు. ఇతను మంత్రి నివాసంలోనే గత ఐదేళ్లుగా లాండ్రీ పని చేస్తున్నాడని చెప్పారు. నిందితుడిని ఒడిశాలో అరెస్ట్ చేసిన పోలీసులు.. బెంగళూరుకు తీసుకువచ్చారు. ప్రస్తుతం నిందితుడిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నామని పోలీసులు తెలిపారు.

ఇవీ చదవండి:అంబులెన్సు లేక.. తల్లి శవంతో బైక్​పైనే 80 కి.మీ..

'ద్రవ్యోల్బణం కట్టడి చేస్తున్నాం.. ఆర్థిక సంక్షోభం మాటే లేదు'

ABOUT THE AUTHOR

...view details