Rahul Gandhi speech at Khammam Congress meeting : ఖమ్మం కాంగ్రెస్ జనగర్జన బహిరంగ సభకు ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయనకు నేతలు ఘన స్వాగతం పలికారు. ముందుగా ఏపీలోని గన్నవరం విమనాశ్రయానికి చేరుకున్న ఆయనకు పార్టీ నేతలు ఘన స్వాగతం పలికారు. అక్కడి నుంచి నేరుగా ప్రత్యేక హెలికాప్టర్‌లో ఖమ్మం చేరుకున్నారు. అక్కడ ఆయన్ను చూసేందుకు కార్యకర్తలు పోటీ పడ్డారు. పోలీసులు వారిని చెదరగొట్టగా.. ఓపేన్ టాప్ కారులో అభిమానులకు అభివాదం చేస్తూ వేదిక వద్దకు చేరుకున్నారు. అనంతరం మాట్లాడిన రాహుల్ గాంధీ.. సీఎం కేసీఆర్‌వైపు ధనికులు, కాంట్రాక్టర్లు ఉన్నారని విమర్శించారు.
కాంగ్రెస్ వైపు పేదలు, రైతులు, అన్ని వర్గాలు ఉన్నాయని ధీమ వ్యక్తం చేశారు. తెలంగాణలో మొదట్లో ముక్కోణ పోటీ అనుకున్నారని.. కానీ ప్రస్తుతం రాష్ట్రంలో బీజేపీ పత్తా లేకుండా పోయిందని అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో పోటీ కాంగ్రెస్‌కు, బీజేపీ బీ టీమ్‌కు మాత్రమేనని అన్నారు. బీజేపీ బీటీమ్‌ను, బీఆర్‌ఎస్‌ను కాంగ్రెస్ ఓడిస్తుందని ధీమ వ్యక్తం చేశారు.
- Congress Meeting at Khammam : 'బీఆర్‌ఎస్ అంటే బీజేపీ బంధుత్వ పార్టీ.. కేసీఆర్ రిమోట్ ప్రధాని మోదీ చేతుల్లో ఉంది'
- Ponguleti Joins in Congress : 'లక్షలాది తెలంగాణ బిడ్డల కోరిక మేరకు కాంగ్రెస్‌లో చేరా'
"ఇటీవల విపక్షాల సమావేశం జరిగింది. విపక్షాల భేటీకి బీఆర్‌ఎస్ వస్తుందా అని అడిగాం. బీఆర్‌ఎస్ భేటీకి వస్తే మేం హాజరుకాబోమని చెప్పాం. కేసీఆర్ అవినీతికి మోదీ ఆశీస్సులు ఉన్నాయి. కేసీఆర్ సర్కారు స్కామ్‌లన్నీ మోదీకి తెలుసు. స్కామ్‌ల వల్లే బీఆర్‌ఎస్.. బీజేపీకి బీ టీమ్‌గా మారింది"- రాహుల్ గాంధీ, కాంగ్రెస్ అగ్రనేత