తెలంగాణ

telangana

విధిరాతను ఎదిరించి.. పెయింటింగ్​లో అద్భుతాలు

By

Published : Sep 16, 2021, 7:38 AM IST

a 26-year-old artist in Bhubaneswar continues to follow his passion for painting

రోడ్డు ప్రమాదంలో రెండు చేతులు కోల్పోయిన ఓ యువకుడు పెయింటింగ్​లో అద్భుత కళాకండాలు సృష్టిస్తున్నాడు. వైకల్యం ఉన్నా.. దృఢ సంకల్పంతో కళాకారుడిగా రాణిస్తున్నాడు. కుండీలు, సీసాలపై పూరీ జగన్నాథుని చిత్రాలు గీసి ఔరా అనిపిస్తున్నాడు.

చేతులు కోల్పోయినా పెయింటింగ్​పై పట్టు వీడని యువకుడు

ఓ 26 ఏళ్ల యువకుడు విధిరాతను ఎదిరించాడు. రోడ్డు ప్రమాదంలో రెండు చేతులు, కాలు కోల్పోయినా పట్టు వదలని విక్రమార్కుడిలా పెయింటర్​ కావాలనే కలను నెరవేర్చుకున్నాడు. కుండలు, కుండీలు, సీసాలపై దేవుళ్లు, ఇతర చిత్రాలను గీసి తన కళానైపుణ్యంతో అబ్బురపరుస్తున్నాడు. మనసులో సంకల్పం దృఢంగా ఉంటే సాధించలేనిది ఏదీ లేదని నిరూపిస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నాడు. ఒడిశా భువనేశ్వర్​కు చెందిన ఈ యువ కళాకారుడి పేరు ప్రభాకర్ ప్రధాన్​. పెయింటింగ్​పై తనకున్న మక్కువ వల్లే దివ్యాంగుడిని అయినప్పటికీ రాణిస్తున్నానని అతుడు చెబుతున్నాడు.

సీసాపై పెయింటింగ్ వేస్తున్న యువకుడు

ఈ యువ కళాకారుడు కుండలపై గీసిన పూరీ జగన్నాథుడి చిత్రాలు అధ్బుతంగా ఉన్నాయి. పూలు, సీనరీల చిత్రాలను కూడా సీసాలు,పాత్రలపై గీస్తాడు. తన ప్యాషన్​తో భవిష్యతుల్లో మరిన్ని కళాకండాలు సృష్టిస్తానని ధీమాగా చెబుతున్నాడు.

పెయింటింగ్ వేస్తున్న యువకుడు

ఇదీ చదవండి:రన్​వేపై గజరాజు హల్​చల్​- రెండు గంటల పాటు..

ABOUT THE AUTHOR

...view details