తెలంగాణ

telangana

భర్త రెండో పెళ్లి.. పిల్లలతో కలిసి భార్య ఆత్మహత్య.. తల్లి శవం వద్ద ఏడుస్తూ కూర్చున్న కుమారుడు

By

Published : Jan 22, 2023, 11:42 AM IST

woman commits suicide

భర్త రెండో వివాహం చేసుకున్నాడని మనస్తాపానికి గురైంది ఓ మహిళ. దీంతో తన ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకుంది. ఝార్ఖండ్​లో జరిగిన ఈ ఘటనలో మహిళ, ఆమె ఎనిమిదేళ్ల కుమారుడు మరణించాడు. మరో కుమారుడు ప్రాణాలతో బయటపడ్డాడు.

ఝార్ఖండ్​లోని పలామూలో అమానవీయ ఘటన జరిగింది. భర్త రెండో పెళ్లి చేసుకున్నాడని మనస్తాపానికి గురైన ఓ మహిళ.. తన ఇద్దరు చిన్నారులతో కలిసి చీరతో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటనలో మహిళ, ఆమె ఎనిమిదేళ్ల కుమారుడు మరణించగా.. మరో కుమారుడు ఛోటు(10) ప్రాణాలతో బయటపడ్డాడు. రాత్రంతా తల్లి, తమ్ముడు మృతదేహం వద్దే ఏడ్చుకుంటూ ఛోటు ఉన్నాడు.

ఆదివారం తెల్లవారుజామున ఛోటు వెళ్లి ఇరుగుపొరుగు వారికి తన తల్లి, తమ్ముడు మరణించిన విషయం తెలియజేశాడు. సమాచారం అందుకున్న పోలీసులు.. మహిళ, ఆమె కుమారుడి మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టానికి తరలించారు. మృతులను శాంతిదేవి, కునాల్​గా గుర్తించారు. ఏడాది క్రితం శాంతిదేవి భర్త వికాస్ దాస్ రెండో వివాహం చేసుకున్నాడు. దీంతో దంపతుల మధ్య తరచుగా గొడవలు జరిగేవి. అవే మహిళ ఆత్మహత్యకు కారణమని మేధినీనగర్​ గ్రామస్థులు తెలిపారు.

అనాథ బాలికపై దారుణం..
మహారాష్ట్రలోని లాతుర్​లో దారుణం జరిగింది. 16 ఏళ్ల అనాథ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు ఓ వ్యక్తి. నిందితుడికి మరో నలుగురు సహకరించారు. ఈ ఘటనపై బాధితురాలి ఫిర్యాదు మేరకు ఐదుగురిపై పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
లాతుర్​లోని ఓ కాలేజీలో బాధితురాలు చదువుతోంది. శుక్రవారం యధావిధిగా కాలేజీకి వెళ్లింది. కాలేజీ క్యాంటీన్​లో ఉండగా బాధితురాలు ఉండగా.. ఆమె వద్దకు ముగ్గురు స్నేహితురాళ్లు వచ్చారు. పార్టీ చేసుకుందామని అంబాజోగై రోడ్డు వైపు తీసుకెళ్లారు. అప్పుడు బాధితురాలి స్నేహితురాళ్లలో ఒకరు ఆమె భర్తకు ఫోన్ చేసింది. దీంతో ఆమె భర్త, ఆటో డ్రైవర్​తో కలిసి ఘటనాస్థలికి వచ్చాడు. బాధితురాలికి మత్తుమందు ఇచ్చి ఆటో డ్రైవర్​ ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. శుక్రవారం సాయంత్రం ఆటోరిక్షా డ్రైవర్ బాధితురాలిని నిర్మానుష్య ప్రదేశంలో వదిలేసి అక్కడి నుంచి పరారయ్యాడు. బాధితురాలు ఎంఐడీసీ పోలీస్​ స్టేషన్​లో తనపై జరిగిన దారుణం గురించి పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాధితురాలి ముగ్గురు స్నేహితురాళ్లు, మరో ఇద్దరిపై పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసుకున్నారు. నిందితుల్లో ఒకరిని అదుపులోకి తీసుకున్నామని.. మిగతా నలుగురిని త్వరలో పట్టుకుంటామని పోలీసులు తెలిపారు.

చిరుతపులి దాడిలో బాలుడు మృతి..
బహిర్భూమికి వెళ్లిన 11 ఏళ్ల బాలుడిపై చిరుతపులి దాడి చేసి హతమార్చింది. ఈ ఘటన కర్ణాటకలోని మైసూర్​లో జరిగింది. శనివారం రాత్రి బహిర్భూమికి వెళ్లిన బాలుడు ఇంటికి తిరిగిరాలేదు. బాలుడి కోసం గ్రామస్థులు రాత్రంతా వెతికినా అతడి ఆచూకీ లభించలేదు. ఆదివారం ఉదయం బాలుడి మృతదేహం గ్రామ శివారులో లభ్యమైంది. అటవీ అధికారులు ఘటనాస్థలికి చేరుకున్నారు. చిరుత పులులు గ్రామంవైపు రాకుండా అడ్డుకోవాలని హోరలహళ్ల గ్రామస్థులు అధికారుల ఎదుట నిరసన వ్యక్తం చేశారు.

ABOUT THE AUTHOR

...view details