తెలంగాణ

telangana

'మహా' విషాదం:  రెండు రోజుల్లో 136 మంది మృతి

By

Published : Jul 24, 2021, 9:49 AM IST

Updated : Jul 24, 2021, 11:37 AM IST

landslide update

మహారాష్ట్రలో భారీ వర్షాల కారణంగా మృతి చెందిన వారి సంఖ్య 136కి పెరిగింది. రాయ్​గఢ్​లో భారీ వర్షాలకు కొండచరియలు విరిగిపడ్డ ఘటనలో మృతుల సంఖ్య 44కు చేరింది. సహాయక చర్యలను ముమ్మరం చేసింది ఎన్​డీఆర్​ఎఫ్​ బృందం. మరో 50 మంది శిథిలాల కింద చిక్కుకున్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు.

మహారాష్ట్రలో కురిసిన కుండపోత వర్షానికి జనజీవనం స్తంభించిపోయింది. కొంకణ్‌ ప్రాంతంలోని రత్నగిరి, రాయ్‌గఢ్‌ జిల్లాల్లో అపార నష్టం వాటిల్లింది. వర్షాల కారణంగా మహారాష్ట్రలో ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 136కి చేరినట్లు ఆ రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. మరోవైపు.. రాయ్‌గఢ్‌ జిల్లా మహర్ తాలుకా తలాయి గ్రామంలో కొండ చరియలు విరిగిపడిన ఘటనలో మృతుల సంఖ్య 44కి పెరిగింది.

ధ్వంసమైన ఇల్లు

అక్కడ సుమారు 30 ఇళ్లు ఉండగా బండలు పడటం వల్ల ఆ గ్రామం తుడిచిపెట్టుకు పోయింది. శిథిలాల కింద చిక్కుకుని గాయపడిన 35 మంది ఆస్పత్రికి చికిత్స పొందుతున్నారని.. రాయ్‌గఢ్‌ జిల్లా కలెక్టర్‌ తెలిపారు. భారీ వర్షాల కారణంగా జిల్లాలో 6 చోట్ల కొండ చరియలు విరిగిపడ్డాయి.

కొండచరియలు విరిగిపడి

సుమారు 50 మంది వరకు శిథిలాల కింద చిక్కుకుని ఉంటారని.. అధికారులు భావిస్తున్నారు. ఎన్​డీఆర్​ఎఫ్ బృందాల ద్వారా సహాయ చర్యలు కొనసాగిస్తున్నట్లు.. చెప్పారు.

సీఎం పర్యటన..

వరద ప్రభావిత ప్రాంతాల్లో మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్​ ఠాక్రే.. హెలికాప్టర్​లో పర్యటించనున్నారు. శనివారం మధ్యాహ్నం 12 గంటలకు మహర్​, తలాయి గ్రామంలో పర్యటించనున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి.

ఇదీ చదవండి:'మహా' విషాదం- కొండచరియలు విరిగిపడి 36 మంది మృతి

'మహా' వరదలు- 48 గంటల్లో 129 మంది మృతి​

Last Updated :Jul 24, 2021, 11:37 AM IST

ABOUT THE AUTHOR

...view details