తెలంగాణ

telangana

విజయవంతంగా క్యూఆర్‌శామ్‌ పరీక్ష.. శాస్త్రవేత్తలకు అభినందనలు తెలిపిన రాజ్​నాథ్​

By

Published : Sep 9, 2022, 6:53 AM IST

విజయవంతంగా క్యూఆర్‌శామ్‌ పరీక్ష
విజయవంతంగా క్యూఆర్‌శామ్‌ పరీక్ష

క్యూఆర్‌శామ్‌/క్విక్‌ రియాక్షన్‌ సర్ఫేస్‌ టూ ఎయిర్‌ మిస్సైల్‌ను మనదేశం ఆరోసారి విజయవంతంగా పరీక్షించింది. సైన్యం చేపట్టే క్షిపణి మదింపు సన్నాహకాల్లో భాగంగా ఒడిశా తీరంలోని చాందీపుర్‌లోని సమీకృత ప్రయోగ కేంద్రం నుంచి ఈ ప్రయోగం జరిగింది.

QRSAM Missile : క్యూఆర్‌శామ్‌/క్విక్‌ రియాక్షన్‌ సర్ఫేస్‌ టూ ఎయిర్‌ మిస్సైల్‌ (భూతలం నుంచి గగనతలంలోకి ప్రయోగించే సత్వర స్పందన క్షిపణి)ను మనదేశం గురువారం ఆరోసారి విజయవంతంగా పరీక్షించింది. సైన్యం చేపట్టే క్షిపణి మదింపు సన్నాహకాల్లో భాగంగా ఒడిశా తీరంలోని చాందీపుర్‌లోని సమీకృత ప్రయోగ కేంద్రం నుంచి ఈ ప్రయోగం జరిగింది. ఈ మేరకు డీఆర్‌డీవో వెల్లడించింది.

విభిన్న పరిస్థితుల్లో ఆయుధ వ్యవస్థల శక్తి సామర్థ్యాలను అంచనా వేయడానికి అత్యంత వేగంతో కదలాడే వైమానిక లక్ష్యాలకు వ్యతిరేకంగా ఈ పరీక్షను చేపట్టినట్లు తెలిపింది. క్షిపణి వ్యవస్థ పనితీరు చక్కగా ఉన్నట్లు వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన రాడార్‌ ఎలక్ట్రో ఆప్టికల్‌ ట్రాకింగ్‌ సిస్టమ్స్‌ అందించిన సమాచారం నిర్ధారించిందని వివరించింది. క్యూఆర్‌శామ్‌ను విజయవంతంగా పరీక్షించడంపై రక్షణమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ డీఆర్‌డీవో శాస్త్రవేత్తలకు అభినందనలు తెలిపారు.

ఇవీ చదవండి:బస్సు బ్రేక్​ పెడల్​ వద్ద నాగుపాము.. డ్రైవర్​ ఏం చేశాడంటే?

భార్యను చంపేశాడని ఆరు నెలలు జైలు శిక్ష.. తీరా చూస్తే పుట్టింట్లోనే..

ABOUT THE AUTHOR

...view details