తెలంగాణ

telangana

India Canada Visa Issue : 'కెనడాలో భారత్​ దౌత్యవేత్తలు సేఫ్​ అనుకుంటేనే.. కొత్త వీసాల జారీ!'

By ETV Bharat Telugu Team

Published : Oct 22, 2023, 5:34 PM IST

India Canada Visa Issue Jaishankar : భారత్​, కెనడా మధ్య సంబంధాలు ప్రస్తుతం క్లిష్ట దశలో ఉన్నట్లు విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్​ తెలిపారు. కెనడాలో భారత దౌత్యవేత్తల భద్రతను పరిశీలించి.. వీసాల మంజూరు ప్రక్రియను ప్రారంభిస్తామని వెల్లడించారు.

India Canada Visa Issue
India Canada Visa Issue

India Canada Visa Issue Jaishankar : భారత్​-కెనడా సంబంధాలు ప్రస్తుతం సంక్లిష్ట దశలో ఉన్నట్లు తెలిపారు విదేశాంగ మంత్రి ఎస్​ జైశంకర్. కెనడా రాజకీయాల్లోని కొన్ని వర్గాలతో తమకు సమస్యలు ఉన్నట్లు చెప్పారు. ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు నెలకొన్న నేపథ్యంలో వీసాల మంజూరు నిలుపుదలపై ప్రజలు ఆందోళన చెందుతున్నట్లు తెలిపారు జైశంకర్.

"కెనడాలో భారత దౌత్యవేత్తలు విధుల నిర్వర్తించడం సురక్షితం కాదని గుర్తించాం. అందుకే కొన్ని వారాల క్రితం వీసాల మంజూరును నిలిపివేశాం. అక్కడ మన దౌత్యవేత్తలతోపాటు ప్రజలు కూడా సురక్షితం కాదు. వారి భద్రతే మాకు ముఖ్యం. వీసాల జారీని మళ్లీ ప్రారంభించే అంశాన్ని నిశితంగా పరిశీలిస్తున్నాం.కెనడాలోని భారత దౌత్యవేత్తల భద్రతలో పురోగతి కనిపిస్తే.. అక్కడ వీసాల మంజూరు ప్రక్రియను ప్రారంభిస్తాం. ఇది త్వరగా జరగాలని నేను కోరుకుంటున్నా"

- ఎస్​. జైశంకర్​, కేంద్ర విదేశాంగ మంత్రి

వియన్నా ఒప్పందంలోని నిబంధనలకు..
Canada Diplomats In India : భారత ప్రభుత్వ వ్యవహారాల్లో కెనడా సిబ్బంది జోక్యం చేసుకుంటారన్న ఆందోళనల దృష్ట్యా.. ఇరు దేశాల దౌత్యసిబ్బంది సంఖ్య విషయంలో సమానత్వం పాటించాలని భారత్​ కోరిందని ఎస్. జైశంకర్ తెలిపారు. వియన్నా ఒప్పందంలోని నిబంధనలకు అనుగుణంగానే.. దౌత్యసిబ్బంది సంఖ్యలో సమానత్వాన్ని అమలు చేసేందుకు చర్యలు తీసుకున్నట్లు చెప్పారు.

భారత్​ వార్నింగ్​కు తలొగ్గిన కెనడా
Canada Diplomats News : భారత్‌లోని తమ దౌత్య సిబ్బందిలో 41 మందిని వారి కుటుంబ సభ్యులతోసహా వెనక్కు రప్పించుకున్నట్టు కెనడా అధికారికంగా శుక్రవారం ప్రకటించింది. దౌత్య సిబ్బందిని తగ్గించుకోకపోతే వారికి అందించే దౌత్యపరమైన రక్షణను ఉపసంహరిస్తామంటూ భారత్‌ హెచ్చరించిన క్రమంలో సిబ్బంది కుదింపు చర్య చేపట్టినట్లు ఆ దేశ విదేశీ వ్యవహారాల మంత్రి మెలానీ జోలీ వెల్లడించారు. దౌత్యవేత్తలకు రక్షణను ఉపసంహరించుకోవడమేనదిఅనూహ్యమైన చర్య అని.. అది అంతర్జాతీయ చట్టాలకు విరుద్ధమని మెలానీ జోలీ ఆరోపించారు.

ట్రూడో ఆరోపణలతో..
Nijjar Killed In Canada :ఖలిస్థానీ ఉగ్రవాది హర్‌దీప్‌ సింగ్‌ నిజ్జర్‌ హత్యలో భారత్​ ఏజెంట్ల హస్తం ఉందంటూ కెనడా ప్రధాని జస్టిన్‌ ట్రూడోచేసిన ఆరోపణలు రెండు దేశాల మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తతలకు దారితీశాయి. ఈ క్రమంలోనే కెనడాలో పనిచేస్తున్న భారత దౌత్యవేత్తపై అక్కడి ప్రభుత్వం వేటు వేసింది. దీనికి ప్రతిచర్యగా భారత్​ కూడా దిల్లీలోని కెనడా దౌత్యవేత్తను బహిష్కరించింది. అంతే కాకుండా కెనడా వాసులకు వీసాల జారీని నిలిపివేస్తూ కూడా నిర్ణయం తీసుకుంది. ఆ తర్వాత దిల్లీలో తమ దౌత్య సిబ్బంది సంఖ్యను తగ్గించుకోవాలని కెనడా ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేసింది.

Canada Diplomatic Immunity : దౌత్యవేత్తల ఉపసంహరణపై కెనడా ప్రధాని కీలక వ్యాఖ్యలు.. భారత్​ స్ట్రాంగ్​ కౌంటర్​

India Canada US Reaction : దౌత్య సిబ్బంది వివాదంపై కెనడాకు వత్తాసు.. భారత్ నిర్ణయం ఆందోళకరమన్న అమెరికా, యూకే

ABOUT THE AUTHOR

...view details